twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా సినీ ప్రస్దానం మొదలై అప్పుడే ఇరవై అయిదు సంవత్సరాలు అయిందా..

    By Nageswara Rao
    |

    విక్టరీని తన పేరులో సోంతం చేసుకన్న ఒకే ఒక హీరో వెంకటేష్. అలాంటి విక్టరీ వెంకటేష్ సినీ ప్రస్దానం మొదలై అప్పుడే ఇరవై అయిదు సంవత్సరాలు దాటిందా..అంటే అవుననే చెప్పాలి. వెంకటేష్ కలియుగ పాండవులు సినిమా వచ్చి ఇరవై అయిదు సంవత్సరాలు అవుతుంది. అప్పుడైతే ఎలాగున్నారో ఇప్పుడు కూడా అదే వినమ్రత, అంతే వినయవిధేతలు ఆయనలో చూడడం చాలా గోప్పతనం. 'మన పని మనం పూర్తి విశ్వాసంగా క్రమశిక్షణతో చేసుకుంటూ పోతే ఫలితం దానంతట అదే వస్తుంది. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. ఈ పాతికేళ్లలో నేను నేర్చుకున్నది ఇదే"" అంటారు వెంకటేష్. నేడు ఆయన పుట్టినరోజు. మరో మూడు రోజుల్లో 'నాగవల్లి" చిత్రం విడుదల కానుంది.

    ఈ సంధర్బంలో ఆయన జీవిత విశేషాలను కోన్నింటిని తెలుసుకుందాం. నేను ఈ స్థాయికి చేరుకోవడంలో ఎందరెందరో సహకరిం చారు. ముఖ్యంగా అమ్మానాన్న ఇచ్చిన ప్రోత్సాహం, వారు నేర్పిన జీవన విధానం నాకు బలమైన పునాదిరాళ్లుగా ఉపకరించాయి. నాన్న క్రమశిక్షణ, అన్నయ్య సురేశ్ విశ్లేషణాత్మక శక్తి నన్నెప్పుడూ ఉత్తేజితుణ్ణి చేస్తుంటాయి. అన్ని బాధ్యతలూ అన్నయ్య చూసుకోవడం వల్ల నాకంటూ ఓ జీవితాన్ని, ప్రశాంతతను అనుభ వించడానికి ఆస్కారం ఏర్పడింది. విజయాలకు ఉప్పొంగిపోవడం, పరాజయా లకు కుంగిపోవడమనేది ఎప్పుడూ జరగ లేదు. అయినా దేని మీదైనా ఎక్కువ ఆశ పెట్టుకుంటేనే కదా నిరాశ ఆవహించేది. కెరీర్ తొలినాళ్లలో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఆబ్లిగేషన్స్ కోసం సినిమాలు చేయాల్సి వచ్చింది. అవి ఆడవని ముందే తెలిసిపోయేది నాకు. అయితే అప్పటి మార్కెట్ దృష్ట్యా, బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆ పరాజయాలవల్ల పెద్దగా దెబ్బలు తగల్లేదు. అదే ఇప్పుడైతే దివాలా అయిపోదును.

    అందుకే ఇప్పుడు అలాంటి ఆబ్లిగేషన్స్ పెట్టుకోవడం లేదు. అయినా కూడా 'ఈనాడు" సినిమా చేయాల్సి వచ్చింది. కమల్‌హాసన్ లాంటి గొప్ప నటునితో చేయాలన్న అభిలాష కూడా అందుకు మరొక కారణం. 'చంద్రముఖి" తరహా సినిమా చేయాలని రెండేళ్ల నుంచి అన్వేషిస్తున్నాను. ఊహించిన విధంగా 'నాగవల్లి" చేసే అవకాశం వచ్చింది. 'చంద్రముఖి"లో కన్నా 'నాగవల్లి"లో ఎక్కువ సర్‌ప్రైజులు కనిపిస్తాయి. అసలు ఆ సినిమాకు ఈ సినిమాకు ఎక్కడా పోలిక కనిపించదు. లవబుల్ నెగటివ్ ఫీల్ కూడా సినిమాలో ఉంటుంది. నా అభిమానుల కోసం ఇందులో ఓ పాట పెట్టాం. సందర్భం కుదరడంతో దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాం.

    'నాగవల్లి"కి గురుకిరణ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి మతిపోయింది. అంత బాగా చేశాడు. పి. వాసు తమిళంలో చేసిన 'చిన్నతంబి" ఆధారంగానే తెలుగులో 'చంటి" చేశాను. అప్పట్లో ఆయనతో ఓ సినిమా అనుకున్నా, కుదర్లేదు. 'నాగవల్లి"తో ఆ కోరిక నెరవేరింది. బెల్లంకొండ సురేశ్ ఈ సినిమా విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నాడు. స్క్రిప్టు కుదిరితే మళ్లీ అతనితో సినిమా చేస్తాను. త్రివిక్రమ్, తేజ, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నానని అన్నారు. ఇలాగే ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు విక్టరీ వెంకటేష్ గారు జరుపుకోవాలని వన్ ఇండియా ఆశిస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X