»   » చిరంజీవి మళ్లీ జైలు ముఖం చూడబోతున్నారా?

చిరంజీవి మళ్లీ జైలు ముఖం చూడబోతున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత జైలు సీన్లలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి వివి వినాయక్ దర్శకత్వంలో 'కత్తిలాంటోడు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని జైలు సీన్లు కూడా ఉన్నాయట. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా భారీ జైలు సెట్ వేస్తున్నారు. సినిమాలో చిరంజీవి జైలు కెళ్లడం, జైలు నుండి తప్పించుకునే సీన్లలో నటిస్తున్నారని సమాచారం.

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి మళ్లీ తన 150వ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 2007లో శంకర్ దాదా జిందాబాద్ తర్వాత ఇప్పుడు మళ్లీ తొమ్మిదేళ్లకు చిరు చేయబోతున్న సినిమాకి అన్నీ కుదిరాయి. ఆయన 150 సినిమా 'కత్తిలాంటోడు' మూవీ షూటింగ్ ని ఈ నెల 15 నుంచి ప్రారంభించబోతున్నారు.

Special Jail Set Being Erected For Chiranjeevi's Kathilantodu

ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ యాక్షన్ సీన్ గ్రూఫ్ ఆఫ్ ఫైటర్స్ తో ప్లాన్ చేసారు. హైదరాబాద్ లోనే ఈ షూటింగ్ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను అభిమానులకు అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రానికి రీమేక్ గా వివి వినాయక్ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది.

హీరోయిన్ దీపిక పదుకోనె అంటూ ప్రచారం..?
చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటికీ అఫీషియల్ గా ఖరారు కాలేదు. ఇప్పటి వరకు తమన్నా, నయనతార, అనుష్క పేర్లు వినిపించాయి. తాజాగా టాలీవుడ్ ఊహకు కూడా అందని ఓ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆవిడ మరెవరో కాదు... ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాల్లో సైతం అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతున్న నెం.1 బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్. ఇప్పటి వరకు దీపిక పదుకోన్ సౌతిండియాలో ఏ హీరోతోనూ నటించలేదు. ఆ మధ్య రజనీకాంత్ కొచ్చాడయన్ లో ఆమె యానిమేషన్ రూపం మాత్రం వాడుకున్నారు. మరి చిరంజీవి సినిమాలో చేయడానికి ఆమె ఒప్పుకుందో? లేదో? తెలియదు కానీ ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. అఫీషియల్ గా సమాచారం వస్తే తప్ప దీన్ని నమ్మలేం.

English summary
A huge prison set is being constructed under the supervision of National Award winning art director Thota Tharani for Megastar Chiranjeevi's comeback film, which is tentatively titled Kathilantodu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu