»   » లెజెండ్ ఆడియో: బాలయ్య సెంటిమెంటుకు ప్రాధాన్యత!

లెజెండ్ ఆడియో: బాలయ్య సెంటిమెంటుకు ప్రాధాన్యత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలో సెంటిమెంట్లను బాగా పాలో అవుతారు. నందమూరి హీరో బాలకృష్ణ కూడా ఇలాంటి సెంటిమెంట్లను తుచా తప్పకుండా పాటిస్తుంటారు. ముహూర్తాలు, వాస్తు, ప్రత్యేక పూజలు లాంటివన్నీ బాలయ్య సెంటిమెంటులో భాగమే. ఇందులో భాగంగా బాలయ్య తాజా మూవీ 'లెజెండ్' ఆడియో విడుదల కార్యక్రమానకి బ్రహ్మముహూర్తాన్ని నిర్ణయించారు.

'లెజెండ్' ఆడియో వేడుక ఏదో ఆషామాషీగా కాకుండా ఒక పద్దతి ప్రకారం చేయనున్నారు. స్పెషల్‌గా ఆడియో సీడీని విడుదల చేసేందుకు ఓ ముహూర్తాన్ని కుదుర్చారు. శిల్పకళావేదికలో మార్చి 7న సాయంత్రం సరిగ్గా 6గంటలకు ప్రారంభమయ్యే ఆడియో వేడుకలో సీడీ లాంచ్‌ను 7.33 నిమిషాలకు చేయనున్నారు.

Special Muhurtham fixed for 'Legend' audio launch

సింహా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టెనర్ 'లెజెండ్'. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాయి కొర్రపాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సొనాల్ చౌహాన్ నాయికలు. మ్యూజిక్ మిస్సైల్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్న ఈచిత్రం ఆడియో రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ 'లహరి మ్యూజిక్' భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు.

English summary
Nandamuri Balakrishna's Legend makers are planning to release the audio of the movie on March 7th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu