»   » పబ్లిసిటీ కోసం సెట్: డిజెపై దిల్ రాజు భారీ ఖర్చు!

పబ్లిసిటీ కోసం సెట్: డిజెపై దిల్ రాజు భారీ ఖర్చు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దిల్ రాజు భారీగా ఖర్చు పెడుతున్నాడు. తమ బేనర్లో 25వ సినిమా కావడంతో ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడని ఆయన... పబ్లిసిటీ విషయంలో కూడా రాజీ పడటం లేదు.

సినిమా ప్రమోషన్స్ నిర్వహించేందుకు హైదరాబాద్ లో రూ. 6 లక్షల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్ వేశారు. సినిమా ప్రమోషన్స్, ప్రెస్ మీట్ ఇలా అన్ని ఇదే సెట్లో నిర్వహిస్తున్నారు. టీవీ, వెబ్, పత్రికలకు సంబందించిన ఇంటర్వ్యూలు, ఫోటో సెషన్స్ అన్ని ఇక్కడే జరుగుతున్నాయి.


Special set for DJ Publicity

ఈ సెట్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేశారు. వాస్తవానికి 'సైడర్' టీం ఇక్కడ షూటింగ్ కోసం ముందే స్టూడియోను బుక్ చేసుకున్నప్పటికీ..... దిల్ రాజు వారిని రిక్వెస్ట్ చేసి వేరే చోటుకి పంపారట. సిటీ మధ్యలో ఉండటం పబ్లిసిటీ ఈవెంట్లకు వీలుగా ఉంటుందనే దిల్ రాజు ఇలా చేశారట.


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 23న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. యు.ఎస్‌లో సినిమాను 300 లొకేషన్స్ లో విడుద‌ల చేస్తుండ‌టం విశేషం.


English summary
A special set has been erected in a top private studio in Hyderabad only to accommodate the publicity and promotions of the DJ movie. Since it's very short time and want to promote the film in as many as mediums such as TVs, web, print, radios and etc, a special set with a cost of over Rs 6 lakh is erected.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu