»   » రోబో 2.0 సంచలం: ఒక్క పాటకి 32 కోట్ల బడ్జెట్టా..!? అసలేం చేస్తున్నారు సామీ???

రోబో 2.0 సంచలం: ఒక్క పాటకి 32 కోట్ల బడ్జెట్టా..!? అసలేం చేస్తున్నారు సామీ???

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ చిత్రంలో రజనీకాంత్‌ ఐదు గెటప్స్‌లో కనిపిస్తారని ఓ టాక్‌. వాటిలో రోబో ఒకటి. దీనికోసం రజనీ ఫేస్‌ మాస్కులు తయారు చేశారు. అదంత ఈజీ కాదు. ఏవేవో పదార్థాలు రజనీ ఫేస్‌కి అప్లై చేసి, అది ఎండిన తర్వాత తీస్తే, వచ్చేదే మాస్క్‌. దీనికోసం రజనీ నాలుగైదు గంటలు కేటాయించాల్సి వచ్చింది.

వాన్స్‌ హార్ట్‌వెల్‌

వాన్స్‌ హార్ట్‌వెల్‌

ఈ సూపర్‌ స్టార్‌ వయసు దాదాపు 65. ఈ ఏజ్‌లో అన్నేసి గంటలు కదలకుండా కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు. ‘లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌', ‘ఐరన్‌ మాన్‌', ‘లైఫ్‌ ఆఫ్‌ పై' తదితర హిట్‌ సిన్మాలకు పని చేసిన హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ వాన్స్‌ హార్ట్‌వెల్‌ రజనీ- అక్షయ్‌ల స్పెషల్‌ గెటప్స్‌కి మేకప్‌ చేశారు.


లాభాల్లో షేర్‌

లాభాల్లో షేర్‌

రజనీ ఇంత శ్రమపడ్డారు కదా? ఆయన ఎంత పారితోషికం తీసుకుని ఉంటారు.. అనుకుంటు న్నారా? సినిమా సాధించే లాభాల్లో షేర్‌ ఇస్తారట. ఆ లెక్క రిలీజ్‌ తర్వాత తెలుస్తుంది. అది కనీసం కొన్ని పదుల కోట్లలోనే ఉంటుందన్నది చెప్పక్కరలేదు కదా...


మెకప్ కూడా చాలా ఖరీదైనదే

మెకప్ కూడా చాలా ఖరీదైనదే

ఇక విలన్ గా కనిపించనున్న అక్షయ్ కుమార్ మెకప్ కూడా చాలా ఖరీదైనదేనట. సినిమాలో పక్షులని ఇష్టపడతాడట ఈ విలన్ అందుకే పక్షులు పలు రకాలు కదా. ఈ పక్షి ప్రేమికుడి గెటప్‌ని కూడా పలు రకాల పక్షులను తలపించే రీతిలో ప్లాన్‌ చేశారట. ఉదాహరణకు కనుబొమలు ఓ పక్షిలా, చేతి గోళ్లు మరో పక్షిలా, జుత్తు ఓ పక్షిని పోలినట్లుగా, మీసాలు మరో పక్షిలా... ఇలా అక్షయ్‌ గెటప్‌ని మౌల్డ్‌ చేశారు.


రోజుకి 2 కోట్ల రూపాయలు

రోజుకి 2 కోట్ల రూపాయలు

అక్షయ్‌ మేకప్‌కి నాలుగైదు గంటలు పట్టేదట. ఒక్కసారి మేకప్‌ వేశాక ‘నో సాలిడ్‌ ఫుడ్‌'. ‘ఓన్లీ లిక్విడ్స్‌'. జ్యూసులు, నీళ్లు, పాలు లాంటివి. అందుకే ఎక్కువ గంటలు షూటింగ్‌ చేసేవారు కాదని సమాచారం. ఇంతకీ అక్షయ్‌ పారితోషికం ఎంతో తెలుసా? రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకున్నారట. ఈ సినిమాకి ఆయన అక్షరాలా 50 కోట్లకు చెక్కు పుచ్చుకున్నారట. మామూలుగా హిందీలో హీరోగా నటించే సినిమాలకు అక్షయ్‌ 50 నుంచి 70 కోట్లు తీసుకుంటారని భోగట్టా.


ప్రపంచ సినీ చరిత్రలో కాస్ట్లీయెస్ట్

ప్రపంచ సినీ చరిత్రలో కాస్ట్లీయెస్ట్

ఇవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు వచ్చిన మరో న్యూస్ పిచ్చెక్కించేలా ఉంది ప్రపంచ సినీ చరిత్రలో కాస్ట్లీయెస్ట్ పాట ఇప్పుడు ఈ సినిమాలోనే ఉంది. ఈ ఘనత '2.0' టీంకే చెందనుంది. తన సినిమాల్లో పాటలకు భారీగా ఖర్చు చేయడం అలవాటైన శంకర్.. ఈ సినిమాలో ఒక పాటకు ఏకంగా రూ.32 కోట్లు ఖర్చు పెట్టించేశారట.


భారీ స్థాయిలో రోబోలను చూపిస్తూ

భారీ స్థాయిలో రోబోలను చూపిస్తూ

ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగిస్తూ భారీ స్థాయిలో రోబోలను చూపిస్తూ.. వాటి మధ్య రజినీ-అమీ జాక్సన్‌ల మీద ఈ పాట తీసినట్లు సమాచారం. ఇప్పటిదాకా 'ధూమ్-3' సినిమాలోని ఒక పాటకు రూ.5 కోట్లు ఖర్చు చేయడమే ఇప్పటిదాకా రికార్డు. దానికి ఆరు రెట్లకు పైగా ఖర్చుతో '2.0'లో ఒక పాటను చిత్రీకరించాడట శంకర్.


రెండు పాటలే

రెండు పాటలే

ఈ పాట కళ్లు చెదిరిపోయేలా ఉంటుందని.. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతుందని అంటున్నారు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు రెహమాన్ ఐదు పాటలు రికార్డ్ చేసినప్పటికీ.. సినిమాలో కనిపించేది రెండు పాటలేనట. మిగతా పాటలూ పెడితే నిడివి పెరిగిపోతుందని భావించి.. రెండు పాటలకే పరిమితం చేశాడట శంకర్. ఆ రెండు పాటలూ కూడా అద్భుత రీతిలో ఉండేలా శంకర్ చిత్రీకరించాడట. ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.English summary
Except for our top league star hero films, the majority of the films will be made on a budget less than Rs.30 crores. In such a scenario, director Shankar is spending Rs. 32 crores for a single song giving a shock to everybody.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu