twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Spider-Man: No Way Home ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

    |

    మార్వెల్ ఫాన్స్ తో పాటు స్పెడ‌ర్ మ్యాన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా స్పైడర్‌ మ్యాన్‌- నో వే హోమ్ ప్రీమియర్స్ అమెరికాలో పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ ను సరిగ్గా నెల క్రితం మార్వెల్‌, సోసిపిక్చ‌ర్ సంయుక్తంగా విడుద‌ల చేశాయి. అలా విధులకు ముందే ఆసక్తి పెంచేసిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

    అమెరికాలో ప్రీమియర్‌స్

    అమెరికాలో ప్రీమియర్‌స్

    మార్వెల్ స్టూడియోస్ అమెరికాలో సోమవారం స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ప్రీమియర్‌స్ వేసింది. దీంతో ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ ర్రివ్యూస్ బయటకు వచ్చాయి. చాలా మంది విమర్శకులను ఈ సినిమా ఆకట్టుకుంది. అమెరికన్ వెబ్ సైట్స్ అన్నీ ముక్త కంఠంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ యొక్క సోలో స్పైడీ సినిమాల త్రయంలో ఇది ఉత్తమ ఎంట్రీ అని అంటున్నారు.

    విప‌రీత‌మైన ఆసక్తి

    విప‌రీత‌మైన ఆసక్తి

    ఈ సినిమాలో పీటర్ పార్కర్‌గా టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించారు. బెనెడిక్ట్ కంబర్‌బాచ్‌ని డాక్టర్ స్టీఫెన్ స్ట్రేంజ్‌గా తిరిగి తీసుకువచ్చారు . జాన్ వాట్స్ దర‍్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెండీయా, విలియమ్‌ డాఫే, జేమీ ఫాక్స్‌, ఆల్ఫ్రెడ్‌ మొలీనా ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మీద ఇప్ప‌టికే విప‌రీత‌మైన ఆసక్తి ఉండడంతో అందరు ఈ సినిమా కోసం ఎదురు చూశారు.

    అద్భుతమైన రెస్పాన్స్

    అద్భుతమైన రెస్పాన్స్

    IGN యొక్క అమేలియా ఎంబెర్వింగ్ , "స్పైడర్ మాన్: నో వే హోమ్‌లో నిజంగా ఎప్పుడూ ఒక్క నీరసమైన క్షణం లేదు. అందుకే ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది'' అని పేర్కొన్నారు. " Deadline.com యొక్క పీట్ హమ్మండ్ "జోన్ వాట్స్ మరోసారి ఈ సిరీస్‌లో తనదైన మ్యాజిక్‌ని రిపీట్ చేసారు. స్క్రీన్ రైటర్స్ క్రిస్ మెక్‌కెన్నా మరియు ఎరిక్ సమ్మర్స్ సహాయంతో స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో ఇది అత్యుత్తమ చిత్రం మాత్రమే కాకుండా, నిజంగా ఒక అద్భుతమైన సినిమా. అని పేర్కొన్నారు.

    మెటా-అడ్వెంచర్

    మెటా-అడ్వెంచర్

    వెరైటీ ఫిల్మ్ క్రిటిక్ పీటర్ డెబ్రూగ్ దీనిని "ఒక తెలివైన మెటా-అడ్వెంచర్" అని పేర్కొన్నాడు, "ఇప్పటి దాకా వచ్చిన స్పైడర్ మ్యాన్ సినిమాలను ట్యూన్ చేసిన ప్రేక్షకులు దీనిని చూసి రివార్డ్ పొందుతారు." అని పేర్కొన్నారు. ఇక ది డైలీ బీస్ట్ యొక్క నిక్ స్కేగర్ దీనిని "MCU యొక్క ఉత్తమ స్పైడీ చిత్రం బై ఎ మైల్" అని పేర్కొన్నారు.

    నమ్మకంగా చెప్పగలను

    నమ్మకంగా చెప్పగలను

    Fandango యొక్క ఎరిక్ డేవిస్ ఒక ట్వీట్‌లో ఇలా వ్రాశాడు, "నేను #SpiderManNoWayHome ఉత్తమ లైవ్-యాక్షన్ స్పైడర్ మ్యాన్ సినిమా అని నమ్మకంగా చెప్పగలను. 'హోమ్‌ కమింగ్' ట్రైలాజీకి థ్రిల్లింగ్ & ఎమోషనల్ ముగింపు, కానీ 20 సంవత్సరాల స్పైడర్ మ్యాన్ సినిమాలకు స్మార్ట్, ఆహ్లాదకరమైన & ఉత్తేజకరమైన నివాళి. ఉల్లాసంగా మరియు హృదయ విదారకంగా, సినిమాలో నేను ప్రతి సెకనును నిజాయితీగా ప్రేమిస్తున్నాను'' అని పేర్కొన్నారు. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ డిసెంబర్ 16న భారతదేశంలో మరియు USలో డిసెంబర్ 17న విడుదల అవుతుంది.

    English summary
    Spider-Man: No Way Home first reviews out
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X