»   »  'బాహుబలి': ప్రభాస్‌ ద్విపాత్రాభినయం.. క్యారెక్టర్ పేర్లు

'బాహుబలి': ప్రభాస్‌ ద్విపాత్రాభినయం.. క్యారెక్టర్ పేర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి'లో ప్రభాస్‌ బాహుబలి, శివుడుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాహుబలి సరసన అనుష్క దేవసేనగానూ, శివుడు పక్కన తమన్నా అవంతికగానూ కనిపించబోతున్నారు. సినిమాలో కీలకమైన యుద్ధ సన్నివేశాన్ని ఈ నెల 23 నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించబోతున్నారు. ఇందులో 2000 మంది జూనియర్‌ కళాకారులు నటిస్తారు. ప్రభాస్‌, అనుష్క, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకుడు.

నిర్మాతలు మాట్లాడుతూ... "ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకింగ్ వీడియో, అనుష్క పుట్టినరోజు సందర్భంగా బిహైండ్ ద సీన్స్, రానా పుట్టినరోజు సందర్భంగా మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేశాం. వాటికి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రభాస్ ఈ చిత్రంలో రెండు పాత్రలు చేస్తున్నారు. వాటిలో బాహుబలి పాత్ర సరసన అనుష్క, శివుడు పాత్ర సరసన తమన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని ఈ నెల 23 నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో తీయబోతున్నాం. మార్చి 5 వరకు అక్కడే ఈ షెడ్యూల్ జరుగుతుంది'' అని తెలిపారు.

రీసెంట్ గా కేరళలో ప్రభాస్‌ పాల్గొన్న పోరాట సన్నివేశాన్ని చిత్రించారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రాజమౌళి కరెక్టుగా ఈగ విడుదలైన రోజు (సంవత్సరం క్రితం)న ఈ చిత్రం ఓపినింగ్ పెట్టుకున్నారు. షూటింగ్ కు ముందు నుంచి ఈ చిత్రం రోజుకో వార్తతో రికార్డు క్రియోట్ చేస్తోంది. ప్రభాస్ గెటప్ దగ్గరనుంచి ఈ చిత్రంలో ప్రతీదీ సంచలనమే. ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యారీ ఎలెక్సా ఎక్స్‌.టి. కెమెరాని వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు కేరళ, తమిళనాడు, రాజస్థాన్‌లలో చిత్రీకరణ జరుగుతుంది.

మరో ప్రక్క 'బాహుబలి' సినిమా కోసమే అన్నట్టుగా ప్రభాస్‌ కూడా ఓ వార్మప్‌ మ్యాచ్‌ ఆడాడు. అదే... 'మిర్చి'. ఇందులో ఆయన కత్తి పట్టి ప్రతినాయకులతో చెడుగుడు ఆడాడు. సూటూబూటూ ధరించి అమ్మాయిల మనసులతోనూ ఆడుకొన్నాడు. మ్యాచ్‌కి ముందు వార్మప్‌ అని ఒకటుంటుంది. సమరానికి సన్నద్ధమవ్వడంలాంటిదన్నమాట. అందులో ఆటగాళ్ల జోరుని చూసి తదుపరి మ్యాచ్‌ ఫలితంపై ఓ అంచనాకి వస్తుంటాం అలాగే బాహుబలిపై మిర్చి మరింత అంచనాలు పెంచేసింది.

ఈ చిత్రానికి కథ: వి. విజయేంద్రప్రసాద్, మాటలు: అజయ్, విజయ్, సంగీతం: ఎం.ఎం. కీరవాణి, ఛాయాగ్రహణం: కె.కె. సెంథిల్‌కుమార్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్.

English summary

 Prabhas will be seen in dual roles in Rajamouli directorial. Baahubali being produced lavishly by Arka Media Works will also feature Anushka, Ramya Krishna in other prominent roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu