»   » స్టార్ హీరో పదిరోజులు లోకల్ ట్రైన్ లోనే.... చిన్నారి మాత్రమే గుర్తు పట్టాడు

స్టార్ హీరో పదిరోజులు లోకల్ ట్రైన్ లోనే.... చిన్నారి మాత్రమే గుర్తు పట్టాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మామూలుగా ఒక లోకల్ ట్రైన్ లో ఒక టీవీ ఆర్టిస్టో, ఒక చిన్న కమేడియనో కనిపించారంటే అక్కడ ఉండే హడావిడి మామూలుగా ఉండదు. అలాంటిది ఒక యువహీరో, ఒకప్పటి స్టార్ హీరో వారసుడు లోకల్ ట్రైన్ ఎక్కితే ఎలాఉంటుందీ? రచ్చరచ్చే కదా. కానీ జాకీష్రాఫ్ కొడుకు టైగర్ మాత్రం ఏకంగా పది రోజుల పాటు

మున్నా మైఖేల్ అనే మూవీలో నటిస్తున్నాడు టైగర్ ష్రాఫ్. ప్రస్తుతం ఈ సినిమా కోసం వాసాయ్ దగ్గర నేషనల్ హైవేపై యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. ఇక్కడికి వెళ్లేందుకు గాను.. లోకల్ రైల్ ను ఆశ్రయిస్తున్నాడు . తలకు హుడీ తగిలించి.. ముఖానికి కర్చీఫ్ కట్టుకుని.. సైలెంట్ గా జర్నీ చేసేస్తున్నాడు. 10 రోజుల పాటు ప్రయాణించినా ఎవరూ గుర్తు పట్టకపోవడం ఆశ్చర్యమే కానీ.. ఓ బుడతడు మాత్రం గుర్తు పట్టేశాడట. షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికెళుతున్న టైంలో.. ఓ చిన్నారి దగ్గరగా వచ్చి "మీరు టైగర్ ష్రాఫ్ లాఉన్నారు మీరే కదూ?" అని అడిగేశాడట.

Spotted: Tiger Shroff on a Mumbai local train

ఆ సమయంలో ట్రైన్ లో పెద్దగా జనాలు లేకపోవడంతో.. ముసుగు తొలగించిన ఈ హీరో.. కాసేపు ఆ చిన్నారితో కబుర్లు చెప్పానంటున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. 10 రోజుల పాటు తననెవరూ గుర్తు కూడా పట్టలేదని స్వయంగా చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు టైగర్ ష్రాఫ్. మామూలుగా అయితే లోకల్ ట్రైన్లో అంత హీరో వస్తాడని ఊహించరు కాబట్టి టైగర్ లా అనిపించినా. వదిలేసి ఉంటారు జనం. లేకుంటే ఈ పులిని సెల్ఫీల్లో బందించేస్తాం అంటూ ఎగబడి గందరగోళం చేసెయ్యరూ...

English summary
Tiger Shroff on Tuesday posted a video on social media in which he can be seen taking a train from Vasai to Bandra in Mumbai. In order to avoid all the fanfare, he wore a mask that covered his whole face.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X