»   » ఎంజాయ్ చేయండంటూ మహేష్ బాబు ట్వీట్: ‘స్పైడర్’ బోనస్ ట్రాక్ ఇదే...

ఎంజాయ్ చేయండంటూ మహేష్ బాబు ట్వీట్: ‘స్పైడర్’ బోనస్ ట్రాక్ ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
'Syder' Akkada Vunnavadu Audio Song Released

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27వ తేదీన సినిమా విడుదల కాబోతోంది. సినిమాపై అంచనాలు పెంచేలా, ప్రేక్షకులు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు.

తాజాగా స్పైడర్ చిత్రంలోని బోనస్ ట్రాక్ మహేష్ బాబు తన అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా రిలీజ్ చేశారు. 'ఇదే స్పైడ‌ర్ బోన‌స్ ట్రాక్.. ఎంజాయ్ చేయండి' అంటూ మ‌హేష్ బాబు ట్వీట్ చేశారు. 'అక్క‌డ ఉన్న‌వాడు' అంటూ సాగే ఈ పాట మాస్ బీట్‌తో సాంగ్ ఆకట్టుకుంటోంది.

‘అక్క‌డ ఉన్న‌వాడు' సాంగ్

‘అక్క‌డ ఉన్న‌వాడు' అనే లిరిక్స్ తో సాగే ఈ పాట మ‌హేష్ ను రామ జోగ‌య్య శాస్త్రి రాశారు. గీతామాధురి పాడింది. ఈ సినిమాకు హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించాడు.


‘హాలీ హాలీ' సాంగ్

కొన్ని రోజుల క్రితం ‘స్పైడర్' చిత్రంలోని ‘హాలీ హాలీ' సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ‘హాలీ హాలీ' పాటను బ్రిజేష్ త్రిపాటి సాండిల్య, హరిణి, సునిత కలిసి పాడారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించారు. రాజమజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. పుచ్చకాయ పుచ్చకాయ అంటూ లిరిక్స్ తో సాగు ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


బూమ్ బూమ్ సాంగ్

స్పైడర్ చిత్రంలోని బూమ్ బూమ్ సాంగును నిఖితా గాంధీ పాడారు. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్

గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్

ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్ప‌క‌ళా వేదిక‌లో స్పైడర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. మురుగదాస్ తెర‌కెక్కించిన‌ ఈ సినిమాలో మ‌హేష్ బాబుకి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ నటించింది.English summary
Akkada Vunnavadu audio song released from 'Syder' movie album. SPYDER featuring Mahesh Babu, Rakul Preet Singh & Sj Surya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu