For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్యామిలీ ప్రేక్షకులకు అనుకూలంగా.... ‘స్పైడర్’ సెన్సార్ రిపోర్ట్!

  By Bojja Kumar
  |

  మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పండగవాతావరణం ఉంటుంది. ఆయన అభిమానులంతా తమ ఫ్యామిలీతో, పిల్లాపాపలతో కలిసి సినిమాకు వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటారు. కుటుంబ ప్రేక్షకుల్లో మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది.

  మరి అభిమానులు ఫ్యామిలీ, పిల్లలతో కలిసి సినిమాకు రావాలంటే.... ఈ చిత్రానికి సెన్సార్ వారు ఇచ్చే సర్టిఫికెట్ ఎంతో కీలకం. క్లీన్ 'U' లేదా 'U/A' సర్టిఫికెట్ వస్తేనే ఇది సాధ్యం. ఈ విషయంలో షూటింగ్ సమయం నుండి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దీంలో ఫ్యామిలీ ప్రేక్షకులకు అనుకూలంగా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది.

  సింగిల్ కట్ కూడా లేకుండా

  సింగిల్ కట్ కూడా లేకుండా

  సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని సింగిల్‌ కట్‌ లేకుండా యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుగా సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

  Spyder Hindi Release In Doubt ‘స్పైడర్’ హిందీ రిలీజ్ అడ్డుకుంటున్నది ఎవరో తెలుసా?
  అంచనాలు భారీగా

  అంచనాలు భారీగా

  ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే స్థాయిలో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సూపర్‌స్టార్‌ మహేష్‌ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నారు దర్శకనిర్మాతలు.

  ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీసర్

  ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీసర్

  ఈ చిత్రంలో మహేష్ బాబు శివ అనే ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా నటిస్తున్నాడు. కెరీర్లో తొలిసారిగా మహేష్ బాబు ఇలాంటి పాత్రలో నటిస్తున్నాడు.

  స్పైడర్ అనేది ఓ సాఫ్ట్ వేర్

  స్పైడర్ అనేది ఓ సాఫ్ట్ వేర్

  ‘స్పైడర్' అనేది ఓ సాఫ్ట్ వేర్ అని తెలుస్తోంది. ఫోన్లో ఎవరైనా బెదిరించినా... ఏడ్చినా, హెల్ప్ అని అడిగినా స్పైడర్ అనే సాఫ్ట్ వేర్ ఆన్ అయి స్క్రీన్ బ్లింక్ అవుతుంది. వెంటనే శివ వెళ్లి వాట ఆటకట్టిస్తాడు.

  నేను స్పైడర్ మ్యానో, సూపర్ మ్యానో కాదు

  నేను స్పైడర్ మ్యానో, సూపర్ మ్యానో కాదు

  నేను స్పైడర్ మ్యానో, సూపర్ మ్యానో కదు.... ఈ సొసైటీని నేను చేంజ్ చేయడం లేదు... నా పని నేను చేస్తున్నాను అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగుకు మంచి స్పందన వస్తోంది.

  మేకలకంటే ఎక్కువగా మనుషులు

  మేకలకంటే ఎక్కువగా మనుషులు

  మేకలకంటే ఎక్కువగా మనుషులు ఉన్నారు, వాళ్లను చంపితే తప్పేంటి అనే ఒక హింసాత్మక ధోరణితో ఇందులో విలన్ కనిపించబోతున్నాడు. ఈ పాత్రలో ఎస్.జె.సూర్య నటిస్తున్నాడు.

  ట్రైలర్

  సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

  English summary
  The most awaited film of the Dussera season Spyder has completed its Censor formalities. The film has got U/A certificate from the board.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X