»   »  స్పైడర్: మురుగదాస్ పై మహేష్ అసహనం? రిలీజ్ డేట్ పక్కా

స్పైడర్: మురుగదాస్ పై మహేష్ అసహనం? రిలీజ్ డేట్ పక్కా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేశ్ తన సినిమాలకి సంబంధించి చేసుకున్న ప్లానింగ్ అంతా మారిపోయింది. 'స్పైడర్' సినిమా షూటింగ్ విషయంలో జరిగిన జాప్యమే అందుకు కారణమని తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాలోని రెండు పాటలను చిత్రీకరించవలసి వుంది. ఈ ఆలస్యం అటు కొరటాల శివ సినిమాపై పడుతోంది. దాంతో మహేశ్ కాస్త చిరాగ్గా వున్నాడట.

స్పైడర్

స్పైడర్

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'స్పైడర్' చిత్రం విడుదల తేదీ పట్ల గత కొన్ని రోజులుగా అస్పష్టత కరవైన విషయం మనకు తెలిసిందే. 'స్పైడర్' సినిమాను సెప్టెంబర్ 22న గానీ .. 27న గాని రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ రెండింటిలో ఏ తేదీన వస్తుందనే విషయంలో క్లారిటీ లేదు. థియేటర్లు బుక్ చేసుకోవాలనుకున్న బయ్యర్లు కూడా ఈ విషయంలో స్పష్టత లేక అయోమయానికి లోనవుతున్నారట. ఈ విషయంపై మహేశ్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.సెప్టెంబర్ 27న

సెప్టెంబర్ 27న

కచ్చితంగా ఒక డేట్ చెప్పకుండా, అలా రెండు డేట్లు చెప్పడంతో అభిమానుల్లో మరింత ఆందోళన మొదలైంది. అలాగే థియేటర్లను బుక్ చేసుకోవడంలో డిస్ట్రిబ్యూటర్లు కూడా అయోమయానికి గురయ్యారు. దీంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. 'స్పైడర్'ను సెప్టెంబర్ 27న కచ్చితంగా రిలీజ్ చేస్తున్నట్టు తేల్చిచెప్పారు. దీంతో విడుదల విషయంలో అందరిలోనూ వున్న అనుమానాలు ఇక తొలగిపోతాయనే చెప్పచ్చు.రెండు పాటలు మిగిలిపోయాయి

రెండు పాటలు మిగిలిపోయాయి

సినిమా షూటింగ్‌ పూర్తైనా.. ఇంకా రెండు పాటలు మిగిలిపోయాయి. ఈ పాటలతో పాటు టాకీ పార్ట్‌ను పూర్తి చేసేందుకు మహేష్ బాబు మురుగదాస్ టీమ్‌తో వచ్చేవారంలో కలవనున్నాడు. జూలై నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్న స్పైడర్ సాంగ్ చిత్రీకరణ.. అన్న‌పూర్ణ సెవెన్ ఎకర్స్ స్టూడియోలో జరుగనుంది. ఇందుకోసం కోటి రూపాయల ఖర్చుతో అద్భుతమైన సెట్ వేశారు.మ‌హేష్‌తో కలిసి 80 మంది డ్యాన్స‌ర్స్

మ‌హేష్‌తో కలిసి 80 మంది డ్యాన్స‌ర్స్

ఈ పాటకు సోభి కొరియోగ్రాఫ్ చేయ‌నుండ‌గా, ఇందులో మ‌హేష్‌తో కలిసి 80 మంది డ్యాన్స‌ర్స్ పాల్గొంటారట. ఇక మ‌రో సాంగ్‌ని ఆగ‌స్టులో షూట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, సినిమాని సెప్టెంబ‌ర్ 27న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్.. కాస్త గ్యాప్ తీసుకుని స్పైడర్ పాటల షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.
English summary
The Spyder makers considered 21st September and 29th September as the release dates.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu