»   » ‘స్పైడర్’ మలమాళ టీజర్‌ రిలీజ్..... తెలుగు, తమిళంలో తేడా అతడే!

‘స్పైడర్’ మలమాళ టీజర్‌ రిలీజ్..... తెలుగు, తమిళంలో తేడా అతడే!

Posted By:
Subscribe to Filmibeat Telugu
"Spyder" Malayalam Teaser Released

మహేష్ బాబు హీరోగా ఏఆర్ ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పైడ‌ర్‌ తెలుగు, తమిళంతో పాటు మలమాళంలో కూడా ఈచిత్రం రిలీజవుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ టీజర్లు విడుదలవ్వగా..... తాజాగా మళయాల టీజర్ రిలీజ్ చేశారు.

తెలుగు, త‌మిళం.... మలయాళం టీజర్ పరిశీలిస్తే ఒక తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు, తమిళంలో ఓ పాత్రలో తమిళ నటుడు ఆర్‌జే బాలాజీ నటించాడు. అయితే మలయాళంలో మాత్రం ఇతడు లేడు.

`పెళ్లిచూపులు` ఫేం ప్రియ‌ద‌ర్శి

తెలుగు, తమిళంలో ఆర్.జె బాలాజీ పోషించిన పాత్రను మలయాళంలో `పెళ్లిచూపులు` ఫేం, తెలుగు నటుడు ప్రియ‌ద‌ర్శి పోషించిన‌ట్లు స్పష్టమవుతోంది.


తెలుగు టీజర్

తెలుగు, త‌మిళ టీజ‌ర్ల‌లో ఆర్‌జే బాలాజీ క‌నిపించిన చోట, మ‌ల‌యాళ టీజ‌ర్‌లో ప్రియ‌ద‌ర్శిని చూడొచ్చు. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. అయితే మళయాలంలో మాత్రమే ఈ మార్పు ఎందుకు చేశారనేది తెలియడం లేదు.


ప్రమోషన్ల జోరు

‘స్పైడర్' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లు జోరందుకున్నాయి. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సాంగ్ విడుదల చేయగా.... తాజాగా ‘పుచ్చకాయ పుచ్చకాయ' అనే మరో సాంగ్ రిలీజ్ చేశారు.


స్పైడర్

స్పైడర్

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా ఎస్.జె.సూర్య నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు.


టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.English summary
Watch SPYDER Malayalam Teaser. The movie is presented by Tagore Madhu in association with NVR Cinema LLP along with Reliance Entertainment Production. Mahesh Babu, Rakul Preet and SJ Suriya are the main leads. The movie is being Directed by AR Murugadoss, Produced by N.V. Prasad and Music by Harris Jayaraj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu