»   » ‘స్పైడర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు భారీ ఏర్పాట్లు

‘స్పైడర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు భారీ ఏర్పాట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నైలో 'స్పైడర్‌' ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. హేరిస్‌ జయరాజ్‌ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు సూపర్‌హిట్‌ అయి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

'Spyder' pre release function on 15 September

కాగా, సెప్టెంబర్‌ 15 సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చాలా గ్రాండ్‌గా జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చే అభిమానుల సమక్షంలో ఈ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరుగుతుంది. ఈ ఫంక్షన్‌లో 'స్పైడర్‌' ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

English summary
Spyder Movie Pre Release Event On September 15th In Hyderabad. Spyder is an upcoming 2017 bilingual Indian spy thriller film written and directed by AR Murugadoss. Produced in Telugu and Tamil languages, the film features Mahesh Babu and Rakul Preet Singh in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu