»   » స్పైడర్ 24 గంటలు కాకుండానే 40 లక్షలు దాటిన వ్యూస్

స్పైడర్ 24 గంటలు కాకుండానే 40 లక్షలు దాటిన వ్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' తాజా సినిమా 'స్పైడర్' కోసం చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీజర్ ఎప్పుడు విడుదలవుతుందా ? అని ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. ఒక్కరోజులోనే స్పైడర్ సంచలనం అయ్యింది.

గురువారం రిలీజ్

గురువారం రిలీజ్

ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు సెట్స్ మీద ఉన్న తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టీజర్ను రిలీజ్ చేస్తుంటారు. అయితే దాసరి మరణంతో కృష్ణ తన పుట్టిన రోజు వేడుకలు జరగలేదు. అదే సమయంలో మహేష్ కూడా స్పైడర్ టీజర్ను కూడా బుధవారం కాకుండా గురువారం రిలీజ్ చేశారు.


'ష్‌..' అంటూ

'ష్‌..' అంటూ

ఓ స్పైడర్‌ (రోబో స్పైడర్‌) ఓ బాక్స్‌ లాంటి ఆకారం నుంచి స్పైడర్‌లా రూపాంతరం చెంది, షూ మీదకు, అక్కడినుంచి హీరో ప్యాంట్‌ మీదకీ, అలా అలా పైకెక్కి, హీరో షోల్డర్స్‌ మీదకు పాకుతుంది. మహేష్‌ ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకుంటాడు.. 'ష్‌..' అంటూ స్పైడర్‌కి స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తాడు. ఈ క్రమంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అద్భుతం అని తీరాల్సిందే. మొత్తంగా చూస్తే 'స్పైడర్‌' టీజర్‌ని హాలీవుడ్‌ రేంజ్‌లో కట్‌ చేశారు.


4 మిలియన్లకు పైగా వ్యూస్

4 మిలియన్లకు పైగా వ్యూస్

నిన్న ఉదయం ఈ టీజర్ విడుదల కాగా, 24 గంటలు గడవకముందే 4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. నిన్న 11 గంటల సమయంలో ఇది విడుదల కాగా, నేటి ఉదయం 9 గంటల సమయానికి 41.83 లక్షల వ్యూస్ ను దాటేసింది. మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తయారవుతున్న ఈ చిత్రం టీజర్ విడుదలైన ఐదు గంటల్లోపే మిలియన్ వ్యూస్ దాటేయగా, ఇప్పటివరకూ 2 లక్షల లైక్స్ తెచ్చుకుంది.


హీరో నితిన్

హీరో నితిన్

విడుదలైన కొద్దిసేపటికే ట్రెండింగ్ సృష్టిస్తున్న ఈ టీజర్‌పై హీరో నితిన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. స్పైడర్ టీజర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ టీజర్ తనకు చాలా నచ్చిందని పోస్ట్ చేశాడు. సినిమా విడుదల వరకూ వేచి ఉండలేనన్నాడు. నితిన్ స్వతహాగా పవన్ వీరాభిమాని. అయినా మహేష్ బాబు టీజర్ గురించి పోస్ట్ చేసి.. ఇండస్ట్రీలో హీరోల మధ్య స్నేహ భావం ఎలా ఉంటుందో మరోసారి నిరూపించాడు.


rnrnrn

అద్భుతంగా ఉందని ప్రశంసలు

ఈ టీజర్ ను చూసిన పలువురు చిత్ర ప్రముఖులు ఇది అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్రం కోసం దసరా వరకూ ఆగలేమంటున్నారు. కాగా, ఈ టీజర్ బుధవారం నాడే విడుదల కావాల్సి వుండగా, దర్శకరత్న దాసరి మరణంతో ఒక రోజు ఆలస్యంగా గురువారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే.English summary
Spyder teaser is now the fastest Telugu film to cross 4 million views within 24 hours and it has received a good response from the audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X