»   » జూనియర్ హీరోల హంగామా పూర్తి..సీనియర్ హీరోల హంగామా స్టార్ట్

జూనియర్ హీరోల హంగామా పూర్తి..సీనియర్ హీరోల హంగామా స్టార్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాజీ బావ-బావమరుదులైన నాగార్జు, వెంకటేష్ ల మద్య రసవత్తర పోరుకు తెర లేస్తోంది. నాగ్ నటిస్తున్న 'రగడ", వెంకటేష్ నటిస్తున్న 'నాగవల్లి" చిత్రాలు ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ కథానాయిక అనుష్క కావడం ఇక్కడ మరింత ఆసక్తికరం. అలాగే...'రగడ"లో అనుష్కతోపాటు ప్రియమణి, చార్మి సెకండ్ అండ్ థర్డ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, 'నాగవల్లి" లోనూ అనుష్కతో పాటు రిచా గంగోపాధ్యాయ, కమలినీ ముఖర్జీ, పూనమ్ కైర్, శ్రద్దాదాస్ ఇతర హీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం.

అన్ని రకాలుగా సమ స్థాయిలో ఉన్న ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదలయ్యేలా ఉండడం చర్చనీయాంశమవుతోంది. తొలుత 'నాగవల్లి" చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయనున్నారని వార్తలు వచ్చినప్పుటికీ..అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే అవకాశాలు లేనందున..ఈ చిత్రం కూడా డిసెంబర్ మూడో వారంలోనే విడుదల కానుందని తెలుస్తోంది.

అయితే 'రగడ" చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేస్తున్నామంటూ ఇప్పటికీ నాగార్జున స్వయంగా ప్రకటించారు. ఈ నేపద్యంలో నాగ్-వెంకీల నడుమ పోటీ అనివార్యం కానుందని సమాచారం. అయితే...లాస్ట్ మినిట్ లో మాజీ బావ-బావమరుదులిద్దరూ రామానాయుడు స్టూడియోలో కానీ, అన్నపూర్ణ స్టూడియోలో కానీ ప్రశాంతంగా కూర్చుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశాలు లేకపోలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu