»   » దిల్‌ రాజు 'మరో చరిత్ర' లో శ్రద్ధా దాస్ క్యారెక్టర్ ఏంటంటే!?

దిల్‌ రాజు 'మరో చరిత్ర' లో శ్రద్ధా దాస్ క్యారెక్టర్ ఏంటంటే!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలచందర్ 'మరోచరిత్ర'లో మాధవి చేసిన పాత్రని తాజాగా రీమేక్ చేస్తున్న 'మరోచరిత్ర' లో శ్రద్ధా దాస్ చేస్తోంది. దాని గురించి శ్రధ్ధా దాస్ మురిసిపోతూ చెప్తూ....నా పాత్ర పేరు సంధ్య. అప్పటి మాధవిలా నేను ఈ చిత్రంలో వితంతువులా కనిపించను. స్టయిలిష్‌ గా...పూర్తి మోడ్రన్‌గా కనిపిస్తాను. ఆహార్యం, దుస్తులు, తలకట్టు ఇలా అన్నీ చాలా ఆధునికంగా వుంటాయి. ఈ సినిమాలో నేను చాలా కొత్తగా వుంటాను. ఇక అభినయపరంగా చూసుకుంటే ముఖ్యంగా సినిమా ద్వితీయార్థంలో అన్ని భావోద్వేగాలు పలికించే అవకాశం కలిగింది.అభినయానికి ఆస్కారమున్న పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాను అంటోంది. వరుణ్‌ సందేశ్‌, అనితలతో రవియాదవ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ లు 'మరోచరిత్ర' రీమేక్ నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మీకు అవకాశం వచ్చింది విధాన్ని వివరిస్తూ...'ఆర్య-2' షూటింగ్‌ లో వున్నప్పుడు దిల్‌ రాజు దగ్గరి నుంచి కబురు వచ్చింది. మొదట్నుంచీ ఆ పాత్రకు వాళ్ళు నన్నే అనుకున్నారట. 'మరోచరిత్ర' లాంటి గొప్ప చిత్రాన్ని మళ్ళీ చేసే అవకాశం వస్తే ఎవరైనా వదులు కుంటారా? అంతేకాదు...కథలోని నా పాత్ర కూడా బాగా నచ్చింది. ఒక విధంగా సంధ్య పాత్ర నా మనసుకు హత్తుకుంది. అందుకే చేస్తున్నానంటోంది. ఇక 'సిద్ధు ఫ్రమ్‌ సికాకుళం'తో పరిచయమైన ఈ ముద్దు గుమ్మ తాను...'డార్లింగ్‌' చిత్రంలో ప్రభాస్‌ సరసన నటిస్తున్నానని, బాలీవుడ్‌ లో నటించిన 'లాహోర్‌' చిత్రం త్వరలో విడుదల కానుందని, ఇవి కాక మరికొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయని ఆమె తన ప్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu