ఆ ముగ్గురి వల్లే నటి శ్రావణి సూసైడ్.. సినీ నిర్మాతను అరెస్ట్ చేస్తాం.. మీడియా సమావేశంలో డీసీపీ
టెలివిజన్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టు పంజగుట్ట డీసీపీ మీడియాకు తెలియజేశారు. శ్రావణి కేసు గురించి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆమె మరణానికి ముగ్గురు కారణమని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సాక్ష్యాలు, వీడియో టేపుల ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేశాం, నిర్మాత అశోక్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొంటమని ఆయన స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ..
Recommended Video

ముగ్గురితో ట్రయాంగిల్ లవ్
ప్రేమ, వేధింపులతో ఆత్మహత్య చేసుకొన్న శ్రావణి వయసు 26 సంవత్సరాలు. 2012లో టీవీ రంగంలో నటించాలని హైదరాబాద్‌కు వచ్చింది. 2015లో సాయికృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. 2017లో అశోక్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ప్రేమతో కార్తీక్ చిత్రంలో ఓ రోల్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సంబంధాలు చోటుచేసుకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2019లో దేవరాజ్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది అని డీసీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు.

దేవరాజ్‌కు శ్రావణిని దూరంగా పెట్టాలని
దేవరాజ్‌తో స్నేహంగా ఉండటం చూసి నచ్చకపోవడంతో దేవరాజ్, సాయిరెడ్డి, అశోక్ రెడ్డి మధ్య ఘర్షణ జరిగింది. గొడవలు జరిగాయి. దేవరాజ్ రెడ్డికి దూరంగా ఉండాలని కుటుంబ సభ్యులు, సాయిరెడ్డి వేధించారు. దేవరాజ్‌రెడ్డికి దూరంగా పెట్టాలని సాయి, నిర్మాత అశోక్ రెడ్డి కుటుంబ సభ్యులకు సూచించారు. అయితే దేవరాజ్‌తో స్నేహంగా, సన్నిహితంగా శ్రావణి ఉంటూ పెళ్లి చేసుకోవాలనే తలంపుతో ఉన్నట్టు ఫోన్ సంభాషణల్లో స్పష్టమైంది అని డీసీపీ చెప్పారు.

సాయి A1గా, అశోక్ రెడ్డిని A2గా, దేవరాజ్ రెడ్డి A3గా
శ్రావణితో పలువురితో జరిగిన ఫోన్ సంభాషణలు మీడియాకు ఇచ్చాం. మీడియాకు తెలిసిన విషయమే మాకు తెలుసు. కోర్టుకు కూడా ఆడియో టేపులు అందజేస్తాం. కేసు దర్యాప్తు చేసిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయి. అశోక్ రెడ్డి కూడా పెళ్లి చేసుకొంటాను, మెయింటెన్ చేస్తానని శ్రావణితో చెప్పారు అని డీసీపీ చెప్పారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణారెడ్డిని A1గా, అశోక్ రెడ్డిని A2గా, దేవరాజ్ రెడ్డి A3గా ఈ కేసులో నమోదు చేశారు.

మానసికంగా వేధించి.. శారీరకంగా కూడా
దేవరాజ్, సాయికృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి మధ్య ట్రాయంగిల్ లవ్‌స్టోరి జరిగింది. ఈ ముగ్గురు కూడా శ్రావణి తమకే చెందాలని ఆరాటపడ్డారు. ఆ క్రమంలో ముగ్గురు ఆమెను వేధించి, శారీరకంగా దాడి చేశారు. తాను మరణించే ముందు ఈ ముగ్గురి కారణమనే విషయాన్ని చెప్పారు. దేవరాజ్‌పై వ్యతిరేకంగా చెప్పకపోయినా.. గతంలో నన్ను వేధిస్తున్నారనే ఆరోపణలపై కేసు నమోదు చేసింది.

అశోక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తాం
శ్రావణిని కుటుంబ సభ్యులు, సాయికృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి వేధించారు, శారీరకంగా హానీ తలపెట్టారు. దేవరాజ్ రెడ్డిని, సాయికృష్ణారెడ్డిని అరెస్ట్ చేశాం. అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారని, ఆయనను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిస్తాం. పూర్తిగా విచారించిన తర్వాత దర్యాప్తు జరిపిన తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేస్తాం. ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం ముగ్గురిని నిందితులుగా భావిస్తున్నాం అని డీసీపీ తెలిపారు.


Click it and Unblock the Notifications











