»   » శ్రీ విష్ణు "మా అబ్బాయి" రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

శ్రీ విష్ణు "మా అబ్బాయి" రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ప్రేమ ఇష్క్ కాద‌ల్‌', 'ప్ర‌తినిధి', 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ''మా అబ్బాయి' చిత్రం ఈ నెల 17 న విడుదలకు సిద్దమవుతోంది.'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేసిన శ్రీ విష్ణు, 'మా అబ్బాయి'గా ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రకాశ్ రావు నిర్మించిన ఈ సినిమాకి కుమార్ వట్టి దర్శకత్వం వహించాడు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బేబీ సాక్షి సమర్పణలో కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

నిర్మాత బలగ ప్రకాష్ రావు మాట్లాడుతూ - "అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. శ్రీవిష్ణు ఇమేజ్ ని మరింత పెంచే సినిమా అవుతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ అంశాలన్నీ ఈ సినిమా లో పుష్కలంగా ఉన్నాయి. మా వెన్నెల క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాతో ఇండస్ట్రీలో నిలబడిపోతుందనే గట్టి నమ్మకం ఉంది. దర్శకుడు కుమార్‌వట్టి కొత్తవాడైనా , అనుభవజ్ఞుడిలా మంచి అవుట్‌ఫుట్ ఇచ్చాడు. " అని చెప్పారు.

sree vishnu maa abbayi on this march 17

దర్శకుడు కుమార్‌వట్టి మాట్లాడుతూ - "ఈ సినిమాలో లవ్, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.శ్రీ విష్ణులోని మాస్ యాంగిల్ ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ఇటీవల విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది " అని తెలిపారు.

శ్రీవిష్ణు, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః థ‌మ‌శ్యామ్,సంగీతంః సురేష్ బొబ్బిలి, పాట‌లుః కందికొండ‌, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, సురేష్ బ‌నిశెట్టి, ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంక‌టేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వండాన రామ‌కృష్ణ‌, నిర్మాతః బ‌ల‌గ ప్ర‌కాష్ రావు,క‌థ‌,స్ర్కీన్ ప్లే,మాట‌లు,ద‌ర్శ‌క‌త్వంః కుమార్ వ‌ట్టి.

English summary
According to the latest update, "Maa Abbayi" makers have locked the arrival date of the movie at the theaters on 17th March
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu