»   » ‘బ్రహ్మోత్సవం’ ఈ నెలలో కూడా ప్రారంభం కావడం లేదు

‘బ్రహ్మోత్సవం’ ఈ నెలలో కూడా ప్రారంభం కావడం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోయే ‘బ్రహ్మోత్సవం' చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని, ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఆయన స్పష్టం చేరారు. సింహాచలం దేవస్థానికి వచ్చిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు.

మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ బ్యాన‌ర్‌పై పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ ‘బ్రహ్మోత్సవం' సినిమా నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు మహేష్ బాబుకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో హిట్ అందించిన దర్శకుడు కావడంతో ‘బ్రహ్మోత్సవం' సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.


Sreekanth Addala about Brahmotsavam

ఈ సినిమాను జ‌న‌వ‌రి 8, 2016 అని రిలీజ్ చేస్తామ‌ని అప్పట్లో ప్ర‌క‌టించారు. సంక్రాంతి పండగకు సినిమా వస్తుందనే ఆశతో చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా అనుకున్నట్లుగా సంక్రాంతికి విడుదల చేయడం లేదు. వివిధ కారణాలతో సినిమా అప్పటికి పూర్తయ్యే అవకాశం లేక పోవడంతో మార్చి 25, 2016న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సినిమా షూటింగ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


వాస్తవానిక ఈ సినిమా షూటింగ్ జులై 10 నుండి మొదలు కావాల్సి ఉంది. తర్వాత ఆగస్టు 18 నుండి మొదలు పెడదామనుకున్నారు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల చెప్పిన విషయాన్ని బట్టి సినిమా సెప్టెంబర్లో మొదలు కానుంది. ‘శ్రీమంతుడు' విడుదల ఆలస్యం కావడంతో ‘బ్రహ్మోత్సవం' షూటింగ్ కూడా అనుకున్న సమయానికి మొదలు కాలేదు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Sreekanth Addala said that Brahmotsavam will be a clean family entertainer like his previous films. The director further expressed his confidence that the film will surely enthrall the audiences of all classes.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu