twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ పరిశ్రమలో మరో విషాదం.. శ్రీకారం కో డైరెక్టర్ కన్నుమూత.. మరో ఇద్దరు కూడా

    |

    కరోనా వైరస్ సెకండ్ వేవ్ రోజురోజుకు మరింత విషమంగా మారుతోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా బాడీ బిల్డర్ లాంటి ఫిట్నెస్ యోధులు కూడా కరోనా ధాటికి మృత్యువాత పడుతున్నారు. ఇక సరైన వైద్యం అందకనే ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో మరో మంచి టెక్నీషియన్ మృతి చెందడం అందరిని కలచి వేసింది.

    ఎంత కంట్రోల్ చేసినా కూడా

    ఎంత కంట్రోల్ చేసినా కూడా

    కరోనా ఫస్ట్ వేవ్ లో రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఇప్పుడు సెకండ్ వేవ్ లో లక్షకు తక్కువ కావడం లేదు. ఇక మరణాల సంఖ్య అయితే ప్రతి రోజు మూడు వేలకు పైగానే ఉంది. ఎంత కంట్రోల్ చేసినా కూడా కరోనా వ్యాప్తి అస్సలు తగ్గడం లేదు. ప్రస్తుతం వస్తున్న లెక్కలు కూడా నమ్మశక్యంగా లేవని తెలుస్తోంది.

    సినిమా పరిశ్రమలో విషాధాలు

    సినిమా పరిశ్రమలో విషాధాలు

    రోజుకి దేశంలో చనిపోతున్న వారి సంఖ్య సగం మాత్రమే బయటకు వస్తోందని ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అనేక రకాల కథనాలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం కరోనాను అరికట్టే విషయంలో సీరియస్ గా ఉండకపోవడమే ఈ మారణ హోమనికి దారి తీసిందని అంటున్నారు. ఇక సినిమా పరిశ్రమలో కూడా రోజుకో కోవిడ్ మరణ వార్తలు బయటకు వస్తున్నాయి.

    సహాయక దర్శకుడు కన్నుమూత

    సహాయక దర్శకుడు కన్నుమూత

    ఇటీవల కోవిడ్ కారణంగా కొంతమంది దర్శకులు నటులు మరణించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా శర్వానంద్ సినిమాకు వర్క్ చేసిన మరొక కో డైరెక్టర్ కూడా కోవిడ్ వలన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఒకే రోజు అదే కుటుంబంలో మరొక ఇద్దరు కూడా మృతి చెందడం అందరిని కలచి వేసింది.

    Recommended Video

    Chakra : Telugu Audience Are Always Says Actor Vishal
     శ్రీకారం సినిమాకు వర్క్ చేసిన రాజా

    శ్రీకారం సినిమాకు వర్క్ చేసిన రాజా

    శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాకు కో డైరెక్టర్ గా వర్క్ చేసిన రాజా ఇటీవల కోవిడ్ భారిన పడ్డాడు. అయితే చికిత్స తీసుకునే లోపే అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక అతని తల్లి దండ్రులు కూడా ఓకేరోజు కోవిడ్ వలన మృతి చెందినట్లు చెబుతున్నారు. రాజా మరణంతో అతనికి సన్నిహితులైన కొందరు సినీ హీరోలు, దర్శకులు సంతాపం ప్రకటించారు.

    English summary
    Corona Second Wave is becoming a monster every day. Thousands of deaths occur every day without a gap. No longer do positive cases count. Millions are crossing. In this order the corona is hurting people from all walks of life regardless of whether they are rich or poor. The recent death of a heroine 's brother has shocked everyone. Corina had not been able to get help from anyone since she had been in the hospital since the morning. Asked for help even through social media but did not get the right answer either.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X