»   » శ్రీను వైట్ల పుట్టినరోజు :రకుల్ చేతుల మీదుగా ( ఫొటోలు)

శ్రీను వైట్ల పుట్టినరోజు :రకుల్ చేతుల మీదుగా ( ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'బ్రూస్‌లీ ది ఫైటర్‌' చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజు వేడుకలను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రముఖ రచయిత కోనా వెంకట్‌, నటుడు జయప్రకాశ్‌, నిర్మాత డి.వి.వి దానయ్య, శ్రీను వైట్ల కుటుంబ సభ్యులు కలిసి నిన్న (గురువారం) సాయంత్రం ఆయన చేత కేక్‌కట్‌ చేయించారు. ఈ ఫొటోలను చిత్ర యూనిట్ వారి అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.

అలాగే ..ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్రంలోని 'లే ఛలో...' అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట ఇక్కడ...ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అనంతరం శ్రీను వైట్ల తనకు శుభాకాంక్షలు తెలియచేసినవారికి ఇలా ధాంక్స్ చెప్పారు...


Thank you each and everyone for your warm wishes ! Blessed to have you all !!


Posted by Sreenu Vaitla on 24 September 2015

పుట్టిన రోజు ఫొటోలు స్లైడ్ షోలో...


సింపుల్ గా

సింపుల్ గా

సెట్ లో కుటుంబ సభ్యులు, తన యూనిట్ సభ్యుల మధ్య సింపుల్ గా ఈ వేడుక జరగింది.


పిల్లలు, భార్య తో

పిల్లలు, భార్య తో

ఈ వేడుకలో శ్రీను వైట్ల భార్య, పిల్లలు కూడా పాలుపంచుకుని ఎంజాయ్ చేసారు.హీరోయిన్...

హీరోయిన్...

శ్రీను వైట్ల తాజా చిత్రం బ్రూస్ లీ హీరోయిన్ కూడా ఈ వేడుకలో సరదాగా పార్టిసిపేట్ చేసింది.


ఉత్సాహంగా

ఉత్సాహంగా

శ్రీను వైట్ల చాలా ఉత్సాహంగా కేకు కట్ చేసి సెలబ్రెట్ చేసుకున్నారు.ఆత్మీయులతో

ఆత్మీయులతో

తనకు ఆత్మీయులు అనుకున్న వారితో పుట్టిన రోజు జరుపుకోవటం ఆనందం కలిగించిందన్నారు.చిరకాల మిత్రులు

చిరకాల మిత్రులు

శ్రీను వైట్ల చిరకాల మిత్రులు కోన వెంకట్,గోపీ మోహన్ ఈ వేడుకలో పాల్గొన్నారు.


నిర్మాత

నిర్మాత

నిర్మాత దానయ్య కేకుని నోట్లో పెట్టి విషెష్ చెప్తూ...పిల్లలు

పిల్లలు

శ్రీనువైట్ల పిల్లలు ముగ్గురూ ఈ వేడుకకు హాజరయ్యి..కేక్ ని తండ్రి చేత తినిపించారుకోన వెంకట్...

కోన వెంకట్...

రచయిత కోన వెంకట్... కేకు తినిపించి శుభాకాంక్షలు తెలియచేసారుగోపీ మోహన్ ...

గోపీ మోహన్ ...

రచయిత గోపీ మోహన్... కేకు తినిపించి శుభాకాంక్షలు తెలియచేసారు


రకుల్...

రకుల్...

హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్..కేకు ని తినిపించి శుభాకాంక్షలు తెలియచేసింది.'బ్రూస్‌లీ' గురించి చెప్తూ... శ్రీను వైట్ల...

'బ్రూస్‌లీ' గురించి చెప్తూ... శ్రీను వైట్ల...

'బ్రూస్‌లీ'ని మరో కొత్త ఫార్మాట్‌లో తీసే ప్రయత్నం చేశా. కోన వెంకట్‌, గోపీమోహన్‌తో ఇదివరకు చాలా సినిమాలకి పనిచేశా. మేం మళ్లీ కలిసి ఈ సినిమాకి పనిచేయడం ఆనందంగా ఉంది. బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డిలాంటి నటులు ఇందులోనూ ఉన్నారు. అయితే ఇదివరకటిలాగా వాళ్ల పాత్రలు ఉండవు. ఒక విభిన్నమైన శైలిలో నవ్విస్తారు. ఈ సినిమాని మేం ముందుగా అనుకొన్నట్టుగానే వచ్చే నెల 2న పాటల్ని, 16న చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు.డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'బ్రూస్‌లీ'. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం ఆడియో ని అక్టోబర్ 2 న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఆడియో రైట్స్ ని జీ మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో జీ మ్యూజిక్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాత. థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

English summary
The unit of Bruce Lee, did try to make Srinu Vaitla’s birthday a pleasant one. They brought in a cake and made him cut the cake. Heroine Rakul, actors Jayaprakash Reddy, producer Danayyya and writers Kona Venkat and Gopi Mohan were present at the celebrations.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu