»   » మహేష్ కూతురికి శ్రీను వైట్ల విషెష్ ఇలా...(ఫోటో)

మహేష్ కూతురికి శ్రీను వైట్ల విషెష్ ఇలా...(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ రోజు మహేష్ బాబు కూతురు లిటిల్ ప్రిన్సెస్ సితార పుట్టినరోజును పురస్కరించుకుని దర్శకుడు శ్రీను వైట్ల తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సితారతో దిగిన ఫోటోను పోస్టు చేసారు. మహేష్ బాబుకు చాలా సన్నిహితంగా ఉండే వారిలో శ్రీను వైట్ల ఒకరు.

ప్రస్తుతం శ్రీను వైట్ల మహేష్ బాబుతో 'ఆగడు' సినిమా చేయడానికి స్క్రిప్టు రెడీ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవల కొంత కాలం ఊటీలో తన టీంతో తిష్టవేసి సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ పూర్తి చేసారు శ్రీను వైట్ల.

 Sreenu Vaitla

మహేష్ బాబు ముద్దుల కూతురు సితార నేటితో సంవత్సరం వయసు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తన సోషల్ నెట్కర్లో సితార ఫోటోలను పోస్టు చేయడంతో పాటు తనను విష్ చేయండి అంటూ మెసేజ్ చేసాడు. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి యూరఫ్‌లో ఉన్నారు.

యూరఫ్‌లోనే సితార తొలి పుట్టన రోజు వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న '1'(నేనొక్కడినే) చిత్రం షూటింగ్ ప్రస్తుతం యూరఫ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్ దంపతులకు జులై 20, 2012న సితార జన్మించింది. సితారను తమ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తున్నారు మహేష్ కుటుంబ సభ్యులు.

<blockquote class="twitter-tweet blockquote"><p>Very happy birthday to the little princess..may god bless u with all the love and happiness! <a href="http://t.co/8qVDSvJ2nW">pic.twitter.com/8qVDSvJ2nW</a></p>— Sreenu Vaitla (@SreenuVaitla) <a href="https://twitter.com/SreenuVaitla/statuses/358474866984378368">July 20, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
English summary
"Very happy birthday to the little princess..may god bless u with all the love and happiness!" Sreenu Vaitla tweeted about Mahesh Babu's daughter Sitara.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu