మాజీ శృంగార తారతో క్రికెటర్ శ్రీశాంత్.. త్వరలోనే షాక్ ఇచ్చేలా సరికొత్త ప్లాన్

ఇండియన్ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కొన్నేళ్ల క్రితం ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ ఎఫెక్ట్ తో ఏడేళ్ల నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్‌ గతేడాది గడువు ముగియడంతో మళ్ళీ క్రికెట్ ఆటతో కొనసాగుతున్నాడు. ఇక మధ్యలో శ్రీశాంత్ సినిమా నటుడిగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆటతో కొనసాగుతూనే నటనపై కూడా దృష్టి పెడుతున్నాడు. అయితే అతను త్వరలోనే మాజీ శృంగార తారతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మళ్ళీ క్రికెట్ ఆటతో బిజీగా

మళ్ళీ క్రికెట్ ఆటతో బిజీగా

దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఫిక్సింగ్ ఆరోపనలతో క్రికెట్ ఆటకు దూరంగా ఉన్న శ్రీశాంత్ మొత్తానికి దేశవాళీ క్రికెట్ లో కొనసాగుతున్నాడు. ఆ మధ్య కేరళ జట్టు తరపున ఆడి ఫేస్ బౌలింగ్ తో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. ఎప్పటిలానే బ్యాట్స్ మెన్ లను తన బౌలింగ్ తో ముప్పుతిప్పలు పెడుతున్నట్లు కామెంట్స్ కూడా అందుకున్నాడు.

నటన వైవు యూ టర్న్

నటన వైవు యూ టర్న్

ఇక క్రికెట్ ఆటకు దూరమైన సమయంలో శ్రీశాంత్ నటన వైవు యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. 2017లోనే అక్సర్ 2 సినిమాలో ఛాన్స్ అందుకొని తెరంగ్రేటం చేశాడు. అంతకుముందే శ్రీశాంత్ కు సినిమా ఫీల్డ్ లో ఉన్నవారితో మంచి సంబంధాలు ఉన్నాయి. తన స్నేహితుల ద్వారా పలు తెలివిజన్ షోలతో కూడా కనిపించాడు.

 హీరోగా చేసినా లక్కు కలిసి రాలేదు

హీరోగా చేసినా లక్కు కలిసి రాలేదు

ఇక మొదటిసారి 2017లో టీమ్ 5 అనే ఒక మలయాళం సినిమాలో హీరోగా నటించిన శ్రీశాంత్ నటుడిగా కాస్త మంచి గుర్తింపు అందుకున్నాడు. అయితే కమర్షియల్ గా ఆ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇక 2019లో మరో రెండు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. కానీ అవేవి కూడా శ్రీశాంత్ కు అనుకున్నంతగా క్రేజ్ తీసుకురాలేకపోయాయి.

 శ్రీశాంత్ తో సన్నీ లియోన్

శ్రీశాంత్ తో సన్నీ లియోన్

ఇక చాలా రోజుల అనంతరం శ్రీశాంత్ హిందీలో ఒక కొత్త సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. పట్టా అనే టైటిల్ తో రూపొందనున్న ఆ సినిమాను ఆర్.రాధాకృష్ణ డైరెక్ట్ చేయనున్నాడు. ఆ సినిమాలో శ్రీశాంత్ ఒక CBI ఆఫీసర్ గా కనిపించనున్నాడట. మాజీ శృంగార తార సన్నీ లియోన్.. అంజలి అనే ఒక పాత్రలో కనిపించనున్నట్లు దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. సన్నీ లియోన్ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకమని చెబుతున్నారు. మరి సన్నీ లియోన్ క్రేజ్ తో శ్రీశాంత్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X