లవ్ ఎంటర్టైనర్ ...('రయ్ రయ్' ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : 'ఈరోజుల్లో' ఫేమ్‌ శ్రీ హీరోగా నటించిన సినిమా 'రయ్ రయ్'. ఈ చిత్రం ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతోంది. చాలా కేర్‌లెస్‌గా ఉండే యువకుని జీవితంలో బాధ్యత ఎలా గుర్తెరిగి మారిపోయాడనేది ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ చిత్రం లో చూపించామని చెప్తున్నారు. పూర్తి కామెడీతో కూడిన చిత్రంగా ఈ సినిమాని చెప్తున్నారు.

శ్రీ (శ్రీ), అతని స్నేహితులు చేసిన కొన్ని పనుల కారణంగా ఆ వూరి ప్రజలంతా వాళ్లని వెలివేస్తారు. వాళ్లకు ఎలాంటి సహాయం చేయరు. శ్రీ తన స్నేహితులతో కలిసి వూరి ప్రజల్ని ఆకట్టుకొని మళ్లీ వారికి చేరువ కావాలనుకొంటాడు. ఆ ప్రయత్నంలో లక్ష్మి (అక్ష) పరిచయం అవుతుంది. ఆ తర్వాత శ్రీ జీవితం ఎలా మారిందనేది మిగిలిన కథ.

హీరో శ్రీ మాట్లాడుతూ ''సినిమా పేరుకి తగ్గట్టుగానే హుషారుగా సాగుతుంది. ఈ చిత్రం నన్ను ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ చేస్తుందని నమ్ముతున్నాను. కిరణ్‌ అందించిన సంభాషణలు ప్రధాన బలం. పాటలు ఇప్పటికే మంచి విజయం సాధించాయ''ని చెప్పారు.
అలాగే....''హీరో రెక్లెస్‌. పక్కామాస్‌. వాడికేం కావాలన్నా వెంటనే దానికోసం ఏదైనా చేసేస్తాడు. ఆ స్వభావాన్నే రయ్‌ రయ్‌ అన్నాం. నా తొలిచిత్రం 'ఈ రోజుల్లో ' పూర్తిగా యువతరం సినిమా. 'రయ్‌..రయ్‌' కుటుంబసమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రం. దీనిలో ఉద్వేగాలు ఆకట్టుకుంటాయి. సుధీర్‌ దర్శకప్రతిభ, కిరణ్‌ సంభాషణలు, అక్ష గ్లామర్‌ ప్రధాన అస్సెట్స్‌. శ్రీవసంత్‌ సంగీతం ఇప్పటికే ప్రధాన బలంగా నిలిచింది. 8 సినిమాలతో మా సినిమా పోటీపడి ఈరోజు రిలీజవుతోంది. పోటీలో విజయం సాధిస్తామన్న ధీమా ఉంది'' అన్నారు.

గోదారి జిల్లాల్లో ప్రతి పల్లెలో ఆంబోతుల్ని వదిలేస్తారు. అలా ఓ ఊళ్లో నాతో పాటు మరో ముగ్గురిని వదిలేశారు. మాలో ఎవరికీ.. ఊరివాళ్ల సాయం లభించదు. అయితే ఆంబోతులంతా ఏకమై ఆ జనాల్ని దారికి తెచ్చుకోవడానికి ఏం చేశాయన్నది ఆసక్తికరం. ఓ అందమైన అమ్మాయి కథానాయకుడితో ఎలా ప్రేమలో పడింది ..అనేది చూడాలంటే తెరపైనే వీలవుతుంది అన్నారు దర్శకుడు.

సంస్థ: శ్రావ్య బాలాజీ మూవీస్‌
నటీనటులు: శ్రీ, అక్ష, చిత్రం శ్రీను, చంటి, శ్రావణ్‌, నరసింహ, ఆహుతి ప్రసాద్‌, వైభవ్‌, భవానీ తదితరులు.
సంగీతం: శ్రీవసంత్,
కెమెరా: వెంకటప్రసాద్‌,
కళ: విఎస్‌. సాయిమణి
నిర్మాతలు: బి.రామకృష్ణ, ఎస్‌.ఎన్‌.రెడ్డి.
దర్శకత్వం: సుధీర్‌రాజు
విడుదల: శుక్రవారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X