twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీ గుమ్ములూరి శాస్త్రి గారికి నివాళులు!!

    By Staff
    |

    Sri Gummuluri Sastry
    పడమటి సంధ్యారాగం సినిమాలో విజయశాంతి తండ్రి పాత్ర వేసిన గుమ్ములూరి శాస్త్రి గారిని మర్చిపోవటం కష్టం. ఆయన సోమవారం రాత్రి (Nov 24, 2008) నిద్రలో తుది శ్వాస వదిలారు. గుమ్ములూరు శాస్త్రి గారు గోదావరి జిల్లాలో గుమ్ములూరి సత్యనారాయణ గారికి జన్నించారు. ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఎమ్.ఎస్.సి ని పూర్తి చేసి అక్కడే లెక్చరర్ గా చేరారు. ఆ తర్వాత 1965 లో ఆస్ట్రో ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేయటానికి యు.ఎస్.ఎ వెళ్ళారు. అక్కడే పి.హె.డి కూడా కాలిఫోర్నియా యూనివర్శిటీ లో పూర్తి చేసారు.అలాగే ఐదేళ్ళపాటు అక్కడే ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసి నోయస్ అండ్ వైబ్రేషన్ స్పెషలిస్ట్ గా వాషింగ్టన్ మెట్రో లో చేరారు.

    ఇక ఆ తర్వాత మీర్ అభ్దుల్లా అనే మిత్రునితో కలసి జంధ్యాల గారి దర్శకత్వంలో పడమట సంధ్యారాగం(1986) చిత్రాన్ని నిర్మించి అందులో నటించారు. టామ్,విజయశాంతి జంటగా చేసిన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ నే సాధించింది.ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అటు అమెరికా ఇటు ఇండియా అనే చిత్రాన్ని డైరక్ట్ చేసి నంది అవార్డ్ సాధించారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ ని మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ఆయన మీర్ అభ్దుల్లా తో కలిసి మరో సారి పడమట సంధ్యారాగం కి సీక్వెల్ మరో సంధ్యారాగం ప్లాన్ చేసారు. అయితే ఆ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.కుటుంబపరంగా ఆయనకు భార్య కనకదుర్గ,ఓ కూతురు,ఇద్దరు మనవలు ఆయనకు ఉన్నారు.

    ఇక విధ్యాధికుడుగా,మంచి వ్యక్తిగా,వక్తగా,నిర్మాతగా,నటుడుగా తనకంటూ ఈ ప్రపంచంలో స్ధానం ఏర్పాటు చేసుకున్న శాస్త్రి గారి మరణం ఆయన మిత్రులకు,కుటుంబీకులకే కాక అభిమానించే అందరికీ తీరని లోటే. ఆయన మృతికి మనసారా దట్స్ తెలుగు శ్రధ్ధాంజలి ఘటిస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X