»   » ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ ఉందంటున్న శ్రీరాఘవ!

‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ ఉందంటున్న శ్రీరాఘవ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

గజిని సూర్య తమ్ముడు కార్తీ తెలుగులో నటించిన 'యుగానికి ఒక్కడు" సినిమాను తిలకించిన తెలుగు ప్రేక్షకుల అభిరుచులు, వారు అందించే ప్రోత్సాహం మరి కొంత కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అని కార్తీ అంటున్నాడు. హైదరాబాద్ లో తెలుగు ప్రేక్షకులతో పాటు తాను కూడా సినిమా చూశానని హీరో కార్తీ సోమవారం హైదరాబాద్ లో విలేకర్లతో మాట్లాడారు. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుల స్పందన మొదటి బాగం వినోదానికి చాలా చక్కగా స్పందిస్తున్నారు. అలాగే రెండవ బాగం లోని ఉత్కంఠభరితమైన పోరాటాల్నీ మొచ్చుకున్నారు.

వారి అభిప్రాయాల్ని, స్పందననీ చెప్పిన తీరు చూస్తే చాలా సంతోషం కలిగింది. రెండున్నర సంవత్సరంపాటు మేము పడ్డ కష్టానికి మంచి ఫలితం లభించదని అన్నారు. ఆ నమ్మకంతోనే తమిళంలో తను నటించిన మరో రెండు చిత్రాలు తెలుగులోకి అనువాదం చేయబోతున్నారన్నారు ఆయన. దర్శకుడు శ్రీరాఘవ మాట్లాడుతూ ఈ సినిమాను 265 రోజుల పాటు చిత్రీకరణ చేశాము. 'విజువల్ ఎఫెక్ట్స్ కి, ఫెర్ఫామెన్స్ కి, పెద్ద పీట వేసిన కథ ఇది అని తెలియజేశారు. ఈ కథకి సీక్వెల్ కూడా ఉంటుంది. అది ఎప్పుడు అనేది త్వరలో తెలియజేస్తామన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu