twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ ‘శ్రీరామ రాజ్యం’ముళ్లపూడి వెంకటరమణకి అంకితం...

    By Sindhu
    |

    ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ ఇటీవల కాలధర్మం చెందిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో వెంకటరమణకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన రచనలు ఎంతో కమనీయంగా ఉంటాయి. బాపు-రమణలు కలిస్తే అచ్చ తెలుగు సినిమాలు రూపొందుతాయి. ఈ ఇద్ధరి కాంబినేషన్ లో ఆణిముత్యాలనొదగినటువంటి సినిమాలు వచ్చాయి. స్నేహానికి నిర్వచనంగా నిలిచారు బాపు-రమణలు.

    ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా, నయనతార సీతాదేవిగా బాపు దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం' చిత్రాన్ని ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకట రమణ జ్ఝాపకార్థంగా ఆయకు అంకితం చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబు మీడియాకు తెలియజేసారు. ఈ చిత్రానికి ముళ్ళపూడి స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సినిమా ప్రారంభానికి ముందుగానే ఆయనీ రచనను పూర్తిచేసారు. ఇదే ఆయన చివరి రచన కూడా! ఇందులో ప్రముఖ నటుడు, పద్మవిభూషన్ అక్కినేని నాగేశ్వర రావు వాల్మీకి మహర్షిగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని నేటి తరం వారికి స్ఫూర్తి కలిగించే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని రాజీపడకుండా రూపొందిస్తున్నారు. జూన్ 10న బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

    English summary
    Nandamuri Balakrishna-Bapu's Upcoming movie ‘Sri Rama Rajyam’ is dedicated to the legendary writer ‘Mullapudi Venkata Ramana’ as he passed away while penning down the dialogues for this story. Balakrishna is ready to come on screen again with this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X