twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మలయాళంలోనూ ‘శ్రీరామ రాజ్యం’ హిట్

    By Bojja Kumar
    |

    బాపు, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన పౌరాణిక చిత్రం 'శ్రీరామ రాజ్యం' మళయాలంలోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. అక్కడ విడుదలైన బెస్ట్ తెలుగు సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పటికే తమిళంలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం తాజాగా జూలై 27న మలయాళంలో విడుదల చేశారు.

    ఈ విషయం గురించి నిర్మాత సాయిబాబు వివరిస్తూ..మలయాళ ప్రేక్షకులను 'శ్రీరామ రాజ్యం' చిత్రం అమితంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. బాపు దర్శకత్వానికి, బాలకృష్ణ, నయనతార పెర్ఫార్మెన్స్‌కి మలయాళ ప్రేక్షకులు మంచి మార్కులు వేశారని వెల్లడించారు.

    దక్షిణాదిన ఈచిత్రం మంచి టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో 'శ్రీరామ రాజ్యం' చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేసేందుక నిర్మాత సాయి బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.

    నందమూరి బాలకృష్ణ రాముడి పాత్రలో, నయనతార సీతపాత్రలో ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో రూపొందిన శ్రీరామ రాజ్యం సినిమా ఫిబ్రవరి 24, 2012తో 100 రోజులు పూర్తి చేసుకుంది. విడుదల రోజే ఓ అందమైన, నయనానందకరమైన దృశ్య కావ్యంగా ప్రేక్షకులు, క్రిటిక్స్ చేత ప్రశంసలు అందుకున్న ఈ మూవీ తెలుగులో 100 రోజుల పాటు సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాకు బాలయ్య, నయనతార నటనతో పాటు బాపు దర్శకత్వం, ఇళయరాజా అందించిన మ్యూజిక్ వెన్నముఖగా నిలిచింది. ఈ చిత్రం విజయవంతం అయిన నేపథ్యంలో బాలయ్య మరిన్ని పౌరాణిక సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు.

    English summary
    Bapu’s devotional flick ‘Sri Rama Rajyam’ was widely hailed as one of the best Telugu movies to have been made in recent times.The movie has been released in Tamil sometime ago and on July 27th, the Malayalam version was released as well. Producer Sai Babu has said that a good response has come from Malayalam movie lovers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X