twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ కు వెళుతున్న 'శ్రీరామ రాజ్యం'..ఈ నెల 17న విడుదల....!

    By Sindhu
    |

    రామాయణం అంటే రాముడొక్కడే కాదు. అది అయోధ్యకు మాత్రమే పరిమితం కాదు. ఆ కథ లోకరీతిని, కళ్లకు కడుతుంది. ఎన్నిసార్లు చూసినా మరో కొత్త కోణం మిగిలే ఉంటుంది. దాన్నే మేం 'శ్రీ రామరాజ్యం"లో చూపిస్తున్నాం అంటున్నారు బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ శ్రీరాముడుగా, నయనతార సీతాదేవిగా రూపొందిన 'శ్రీరామరాజ్యం' చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కు వెళుతోంది.

    మహా దర్శకుడు బాపు రూపొందించిన ఈ దృశ్యకావ్యాన్ని శుక్రవారం (నవంబర్ 11) నాడు సెన్సార్ సబ్యులు తిలకించనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించాలన్న తన చిరకాల కోరిక నెరవేరుతున్నందుకు నిర్మాత యలమంచిలి సాయిబాబు ఆనందంగా వున్నారు.

    తండ్రి ఎన్టీఆర్ కు తగ్గ రీతిలో శ్రీరాముడి పాత్ర పోషణలో బాలకృష్ణ అద్భుతంగా ఒదిగిపోయారని ఆయన అంటున్నారు. 'పురాణ గాథను నవతరానికి నచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. శ్రీరాముడు వనవాసం నుంచి తిరిగి రావడంతో ఈ కథ మొదలవుతుంది. ఇది ఉత్తర రామాయణంలోని అంశాల్ని చూపిస్తుందన్నారు. ఇళయరాజా స్వరాలు సినిమాకు వన్నె తెచ్చాయని నిర్మాత అన్నారు. బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ నెల 17 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.

    English summary
    The release date of Sri Rama Rajyam has been finalized. The movie will be censored on the 11th of this month and it will be released on the 17th. The stills released of Balakrishna has surprised many people, and the expectations of the film has gone up.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X