For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవితపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. నీ కూతురు చేస్తే తప్పులేదా? అంటూ

|

అవకాశం దొరికేతే చాలు రంగంలోకి దిగుతోంది టాలీవుడ్ సంచలన నటీమణి శ్రీరెడ్డి. తెలుగు సినీ పరిశ్రమలో నడిచేది బూతు పురాణమేనని, అవకాశాల పేరిట మహిళలను నమ్మించి మోసం చేయడంలో టాలీవుడ్ సినీ పెద్దలను మించిన వారు ఉండరని పేర్కొంటూ శ్రీరెడ్డి చేసిన పోరాటం అందరికీ తెలిసిందే. 'కాస్టింగ్ కౌచ్' విషయమై శ్రీరెడ్డి సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఆమె చేసిన ఈ పోరాటం ఒక దశలో పీక్ స్టేజ్‌కి వెళ్లినప్పటికీ ఆ తర్వాత అనుకోకుండా నీరుగారి పోయింది. దీంతో హైదరాబాద్ వదిలి చెన్నైలో మకాం పెట్టిన ఆమె ఫేస్‌బుక్ వేదికగా తాను టార్గెట్ చేసిన అందరికీ చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నటి జీవితపై సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. వివరాల్లోకి పోతే..

 'దొరసాని'ని గెలికిన శ్రీరెడ్డి

'దొరసాని'ని గెలికిన శ్రీరెడ్డి

జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక తొలి సినిమా 'దొరసాని'. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. శివాత్మిక, ఆనంద్ దేవరకొండ వెండితెరపై మొదటిసారి మ్యాజిక్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విషయంలో జీవితతో గెలుక్కుంది శ్రీ రెడ్డి.

శివాత్మికను దేవరకొండ కిస్ చేశాడా?

నిజానికి ‘దొరసాని' సినిమాలో ఓ లిప్ లాక్ సీన్ ఉంది. కథలో భాగంగా ఆ సీన్ ఉండి తీరాల్సిందే. అందుకే ఆ సీన్ షూట్ చేశారు మేకర్స్. అయితే దీన్నే టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి అటాక్ చేయడం ప్రారంభించింది. ‘దొరసాని' సినిమా హిట్టా? ఫ్లాపా? శివాత్మికను దేవరకొండ కిస్ చేశాడా?? ఈ విషయంపై లైవ్ లోకి వస్తా.. మాట్లాడుకుందాం అంటూ ఓ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

గతంలో లిప్ లాక్స్‌పై జీవిత కామెంట్స్

'ఇప్పటి సినిమాల్లో లిప్‌లాక్స్ ఒకరి మీద ఒకరు పడటం లాంటి సీన్స్ ఎక్కువైపోతున్నాయి.. బెడ్ రూమ్‌లో చేయాల్సిన పనులు రోడ్డు మీద చేస్తామా' అంటూ గతంలో జీవిత చేసిన కామెంట్స్‌ని గుర్తు చేస్తూ నాటి వీడియోను షేర్ చేసింది శ్రీ రెడ్డి. ఈ మేరకు 'జీవిత గారూ ఇది మీకు గుర్తుందా' అంటూ చురకలంటిస్తూ శ్రీరెడ్డి ఈ పోస్ట్ వదలటం గమనార్హం.

శివాత్మిక తల్లి జీవితపై చెడుగుడు ఆడేస్తూ శ్రీరెడ్డి

శివాత్మిక తల్లి జీవితపై చెడుగుడు ఆడేస్తూ శ్రీరెడ్డి

గతంలో కాస్టింగ్ కౌచ్, నడి రోడ్డుపై శ్రీరెడ్డి చేసిన అర్ధనగ్న ప్రదర్శన లాంటి విషయాల్లో జీవితతో ఉన్న వైరాన్ని గుర్తు చేసుకుంటూ జీవితపై అటాక్ చేసింది శ్రీ రెడ్డి. ''జీవిత గారు నీ కూతురు దగ్గరకి వచ్చేసరికి ఎన్ని పత్తిత్తు కబుర్లు చెప్తున్నారో ఒకసారి తవ్వుకుందాం.. మీరెలాగూ మా అసోసియేషన్ కార్డుకి అడ్డం పడుతున్నారని తెల్సు..స్టిల్ మాట్లాడతా..'' అంటూ శ్రీ రెడ్డి చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.

అదును చూసి.. అబ్బో! అనేలా చేస్తున్నావ్‌గా

అదును చూసి.. అబ్బో! అనేలా చేస్తున్నావ్‌గా

కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేసిన పోరాటం ఫ్లాప్ అయినప్పటికీ.. ఆమె టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ వదలకుండా ఇలా కామెంట్స్ చేయం మరోసారి హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. హైదరాబాద్‌లో లేకున్నా టాలీవుడ్ పెద్దలపై అదును చూసి శ్రీరెడ్డి చేస్తున్న అటాక్స్ అబ్బో! అనేలా ఉంటున్నాయి. దీంతో.. ఇదే కంటిన్యూ అయితే శ్రీరెడ్డి టైమ్ మరోసారి టర్న్ అవుతుందేమో అనే సందేహం వ్యక్తమవుతోంది జనాల్లో.

 దొరసాని మూవీ

దొరసాని మూవీ

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో 'దొరసాని' చిత్ర రూపొందింది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించారు. హిస్టారికల్ లవ్ స్టోరీగా చాలా ఏళ్ల క్రిందటి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై యశ్‌ రంగినేని, మధురా శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మించారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం సమకూర్చారు. జులై 12 న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

English summary
Tollywood sensetion actor Sri Reddy attacked Jeevitha with her facebook post. She posted about Dorasani liplock seen which is between Shivathmika and Anand Deverakonda
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more