twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబుపై శ్రీరెడ్డి కామెంట్స్... ఫ్యాన్స్ క్విక్ రియాక్షన్!

    |

    Recommended Video

    Sri Reddy Interesting Comments On Mahesh Babu | Filmibeat Telugu

    మొన్నటి వరకు తమిళనాడులో ఉంటూ అక్కడే సినిమా అవకాశాలు దక్కించుకుంటూ తన కెరీర్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టిన శ్రీరెడ్డి ఏపీలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో తన దృష్టి పూర్తిగా పాలిటిక్స్ వైపు మళ్లించింది. ఏపీ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తూ వరుస వీడియోలు విడుదల చేయడంతో పాటు సోషల్ మీడియాలో తనకు నచ్చిన వారిపై ప్రశంసలు, నచ్చని వారిపై విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా శ్రీరెడ్డి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎఫ్‌బిలో ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.

    మహేష్ బాబు రావాలిన అవసరం ఉంది

    మహేష్ బాబు రావాలిన అవసరం ఉంది

    మహేష్ బాబు ఫోటో షేర్ చేసి శ్రీరెడ్డి ‘‘ఆయన సినిమాల్లో స్పూర్తిదాయకమైన సబ్జెక్టులు ఎంచుకుంటారు. ఎంత మంది ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారు? ఆయనకు సూటయ్యే పార్టీ ఏది? నేను ఆయన ఎంచుకునే సబ్జెక్టులకు, సింప్లిసిటీకి అభిమానిని'' అంటూ వ్యాఖ్యానించారు.

    ఫ్యాన్స్ క్విక్ రియాక్షన్

    ఫ్యాన్స్ క్విక్ రియాక్షన్

    శ్రీరెడ్డి పెట్టిన పోస్టుపై మహేష్ బాబు అభిమానులు వెంటనే రియాక్ట్ అయ్యారు. కొదరు ఆయనకు వైసీపీ సూటవుతుందని, మరికొందరు టీడీపీ సూటవుతుందని వ్యాఖ్యానించారు. మరికొందరేమో ఆయన్ను రాజకీయాల్లోకి లాగొద్దంటూ వేడుకున్నారు.

     రాజకీయాలకు దూరంగా మహేష్ బాబు

    రాజకీయాలకు దూరంగా మహేష్ బాబు

    ఇటీవల పలు సందర్బాల్లో మహేష్ బాబుకు పాలిటిక్స్ గురించిన ప్రశ్నలు మీడియా నుంచి ఎదురైంది. దానికి ఆయన రియాక్ట్ అవుతూ తాను పూర్తిగా రాజకీయాలకు దూరం అని, తనకు వాటి గురించి తెలియదని, ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను అని, తనకు తెలిసిన సినిమా రంగంలోకనే కొనసాగుతాను అని స్పష్టం చేశారు.

     బిజీ బిజీగా మహేష్ బాబు

    బిజీ బిజీగా మహేష్ బాబు

    మహేష్ బాబు తన సినిమా ప్రొఫెషన్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' సినిమా చేస్తున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తారని టాక్.

    English summary
    "Mahesh Babu choose very inspirational subjects in movies..How many of you invite him in to politics and which party is suitable for him??I am a fan of his subjects nd simplicity." Sri Reddy tweert about Mahesh Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X