twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరెడ్డి నిజాలు: ఆ రోజు వర్మ ఏం మాట్లాడారు? కొరటాలతో సెటిల్మెంటా? తేజ ఆఫర్ల వెనక...?

    By Bojja Kumar
    |
    Sri Reddy reveals about RGV and Teja settlement

    శ్రీరెడ్డి విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కల్పించుకుని రూ. 5 కోట్లకు సెటిల్మెంట్ ప్రయత్నాలు చేయడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఒప్పుకున్నారు. రామ్ గోపాల్ వర్మ మాత్రమే కాదు.... చాలా మంది ఆమెతో సెటిల్మెంట్ చేసుకోవడానికి ముందుకొచ్చారట. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగింది అనే నిజాలు శ్రీరెడ్డి బయట పెట్టారు. ఇందులో వర్మ విషయంతో పాటు కొరటాల శివ, దర్శకుడు తేజ అంశాలు కూడా ప్రస్తావించారు.

    వర్మతో గతంలో పరిచయం లేదు

    వర్మతో గతంలో పరిచయం లేదు

    రామ్ గోపాల్ వర్మ తనకు గతంలో ఎప్పుడూ పరిచయం లేదని, గతంలో ఆయన తీసే ఓ సినిమా ఆడిషన్స్ కోసం శ్రీనగర్ కాలనీలో ఆడిషన్స్ వెళ్లాను. ఆ సమయంలో ఆయన ఏదో ఎడిటింగ్ పని మీద అక్కడకు వస్తే ఆయనతో కలిసి ఫోటో దిగాను. అపుడు ఆయనతో మాట్లాడే అవకాశం కూడా దొరకలేదు. నేను ఎవరో ఆయనకు అప్పటికీ తెలియదు, నేను ఫోటో దిగిన విషయం కూడా ఆయనకు గుర్తుండే అవకాశం కూడా లేదు అని శ్రీరెడ్డి తెలిపారు.

    Recommended Video

    prakash raj sensational Comments On sri reddy
    వర్మ లాంటి వ్యక్తి నా గురించి అలా.. హ్యాపీగా ఫీలయ్యాను

    వర్మ లాంటి వ్యక్తి నా గురించి అలా.. హ్యాపీగా ఫీలయ్యాను

    ముంబైలో పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియదు, కానీ శ్రీరెడ్డి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు అని రామ్ గోపాల్ వర్మ చెప్పడం, ఝాన్సీ లక్ష్మీ భాయితో పోలుస్తూ ట్విట్టర్లో కామెంట్స్ చేయడంతో ఆనందంగా ఫీలయ్యాను అని శ్రీరెడ్డి తెలిపారు.

    ఆ రోజు ఫోన్ చేసి గంటన్నర మాట్లాడారు

    ఆ రోజు ఫోన్ చేసి గంటన్నర మాట్లాడారు

    ఆయన నాకు ఫోన్ చేసి దాదాపు గంటన్నర వరకు మాట్లాడారు. ‘శ్రీ నువ్వు చేస్తున్నదాంట్లో 100 శాతం సక్సెస్ అవుతావనుకుంటున్నావా? ఆ థియేటర్స్ ఇచ్చేస్తారనుకుంటున్నావా? లేక ఆ స్టూడియోస్ తీసుకుందామనుకుంటున్నావా? అవన్నీ అవుతాయనుకుంటున్నావా? ఎంత పెద్ద వాటిని ముట్టుకుంటున్నావో తెలుసా నీకు? అవన్నీ జరుగవు. జరిగేవి కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఆలోచించు అన్నారు. అలా మాట్లాడుతూ సురేష్ రెడ్డి కొడుకు అభిరామ్ ప్రస్తావన తెచ్చారు... అని శ్రీరెడ్డి తెలిపారు.

    బంగారు బాతును గుడ్లు వాడుకోవాలి తప్ప కోసేయకూడదన్నారు

    బంగారు బాతును గుడ్లు వాడుకోవాలి తప్ప కోసేయకూడదన్నారు

    రామ్ గోపాల్ వర్మ ఒకటే మాట అన్నారు. బంగారు బాతును గుడ్లు వాడుకోవాలి తప్ప కోసేయకూడదు. సురేష్ బాబు అనే వ్యక్తి వద్ద స్టూడియోలు ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి... వారితో బావుంటే మీకు ఫ్యూచర్ బావుంటుంది. అంతే కానీ వారితో గొడవలు పెట్టుకుంటే రేపు నువ్వు సర్వైవ్ కాలేవు. వీళ్లంతా పెద్దోళ్లు, వాళ్లతో నీకు తలనొప్పులు ఎందుకు? తొక్కేయడానికి ట్రై చేస్తారు. ఎంత వరకు పాజిబిలిటీస్ ఉంటాయో వాటిని తీసుకుని పక్కకు జరిగేయ్. సురేష్ బాబుగారి అబ్బాయి విషయంలో వారి ఫ్యామిలీ బాగా ఫీలవుతున్నారు. ఎంతకాదన్నా కొడుకు కాబట్టి కాస్త చూడు, సెటిల్మెంట్ చేద్దాం తప్పుకో అన్నట్లు మాట్లాడారు.... అని శ్రీరెడ్డి తెలిపారు.

    వెంటనే నో చెప్పలేక పోయాను

    వెంటనే నో చెప్పలేక పోయాను

    ఆయన అలా సెటిల్మెంటు గురించి చెప్పిన దానికి వెంటనే నో చెప్పలేదు. నాకు కొంత సమయం కావాలన్నాను. మనసులో నో చెప్పాలని ఉన్నా కూడా... అలాంటి పెద్ద వ్యక్తితో హార్ష్‌గా మాట్లాడితే నా ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుందని అలా చెప్పాను. మర్నాడు ఫోన్ చేసిన నాకు డబ్బులు వద్దని చెప్పాను. నన్ము నమ్ముకుని ఇంత మంది ఆర్టిస్టులు నాతో పాటు గొంతు కలిపారు. వారు సపోర్టు లేక పోతే నేను చెప్పేదాంట్లో బలం ఉండేది కాదు. ఇలాంటి సమయంలో నేను డబ్బులు తీసుకుని పక్కకు జరుగడం మంచిగా అనిపించడం లేదు. పోరాటం అనే దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను. డబ్బులు తీసుకోవద్దని ముందే డిసైడ్ అయ్యాను. డబ్బులు తీసుకుని నా వెనక ఉన్న వారికి అన్యాయం చేస్తే వారి ఉసురు తగులుతుందనే కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను... అని వర్మకు చెప్పినట్లు శ్రీరెడ్డి తెలిపారు.

    కొరటాల శివ విషయంలో సెటిల్మెంట్ జరిగిందా?

    కొరటాల శివ విషయంలో సెటిల్మెంట్ జరిగిందా?

    కొరటాల శివ గురించి ఇక ఎలాంటి కామెంట్లు చేయకుండా ఉండటానికి 50 లక్షలకు ఓ డీల్ కుదుర్చుకున్నారు. దానికి సంబంధించి హైదరాబాద్ కు చెందిన ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి దీనికి మధ్యవర్తిత్వం వహించారు. మా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి... అని కొందరు అంటున్నారు, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు అనే ప్రశ్నకు శ్రీరెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సెటిల్మెంటు కోసం ఎవరు మాత్రం ట్రై చేయరు. మనం పుచ్చుకున్నామా? లేదా? అనేదే ముఖ్యం అని శ్రీరెడ్డి అన్నారు. ఇది జరిగిందా? లేదా? అని యాంకర్ ప్రశ్నకు ‘నేను ఇపుడు క్లారిటీ ఇవ్వలేను సార్'... అంటూ శ్రీరెడ్డి దాటవేత దోరణి ప్రదర్శించారు.

    ఈ సమయంలో కొరటాలపై కాంట్రవర్సీ చేయలేను

    ఈ సమయంలో కొరటాలపై కాంట్రవర్సీ చేయలేను

    కొరటాల విషయం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను. కొన్ని కొన్ని ఇబ్బంది పడేవి ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనేసుకుని ఉన్నారు, అవి నడవాలి... ఇపుడు దాన్ని కాంట్రవర్సల్ చేయడం అవసరం లేదు. దాని గురించి కొంత గ్యాప్ ఇచ్చి మాట్లాడతాను అని శ్రీరెడ్డి తెలిపారు. సెటిల్మెంట్లు ఒకరి వైపు నుంచి కాదు, అందరి వైపు నుండి జరిగాయి అని శ్రీరెడ్డి వెల్లడించారు.

    దర్శకుడు తేజ కూడా...

    దర్శకుడు తేజ కూడా...

    దర్శకుడు తేజ వాళ్ల ఆఫీసుకు పిలిచి అప్పటి కప్పుడు రెండు సినిమాలు ఆఫర్ చేశారు. అపుడు ఎందుకు పిలిచారా? అనుకున్నాను. తర్వాత ఆయన కూడా ఓపెన్ అయిపోయారు. ఇలా సురేష్ బాబుగారి విషయంలో కానీ, కోన వెంకట్ అవ్వొచ్చు, నాని అవ్వొచ్చు, శేఖర్ కమ్ముల అవ్వొచ్చు.... నేను మాట్లాడతాను, ఇండస్ట్రీ పరువు తీయకు అని.... తనతో సెటిల్మెంట్ ప్రయత్నాలు చేశారు అని శ్రీరెడ్డి తెలిపారు.

    English summary
    Sri Reddy reveals about RGV and Teja settlement. It’s not only RGV who tried for settlement, another big director tried for settlement. It’s director Teja who tried to lure her with two film offers and a lump sum amount to Sri Reddy to keep quiet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X