Just In
- 37 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శ్రీ రెడ్డి సెన్సేషన్: 'రాపాక మీరు కేక' అంటూ పీకే పై బూతుల వర్షం
సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి రంగంలోకి దిగింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని పలువురు సినీ ప్రముఖులపై విరుచుకుపడుతున్న ఆమె స్పెషల్‌గా కొందరిని ఫుల్ టార్గెట్ చేసింది. అదును చూసి వారిపై బూతుల వర్షం కురిపిస్తూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాకను లైన్ లోకి తెస్తూ పీకే పై సంచలన కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే..

జనసేన ఒన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రాపాక వర ప్రసాద్.. జనసేన ఒన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తూర్పుగోదావారి జిల్లా రాజోలు నియోజకవర్గం నుండి గెలిచిన ఈయన ఈ మధ్యకాలంలో వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

మాట మార్చిన రాపాక.. ఏది ఏమైనా జనసేన వీడను
ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లోనే ''జనసేనలో ఉంటే నా నెంబర్ ఒకటి.. అదే వైసీపీలోకి వెళ్తే నా నంబర్ 151'' అని రాపాక చెప్పారు. ఏది ఏమైనా తాను జనసేన పార్టీ వీడనని కుండబద్దలు కొట్టారు. కానీ మారుతున్న రాజకీయ పరిస్థితులు, జనసేన పార్టీలో చోటుచేసుకుంటున్న మార్పులు, పార్టీలో తనకు ఇస్తున్న ప్రాధాన్యతల కారణంగా ఆయన స్వరం మారింది.

వైసీపీకి మద్దతుగా రాపాక టాక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్న ఇంగ్లీష్ మీడియం, మూడు రాజధానుల ఇష్యూను బహిరంగంగానే తప్పుబట్టారు రాపాక. అలాగే ఇటీవల అసెంబ్లీలో మూడు రాజధానుల విషయమై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించి వైసీపీకి మద్దతుగా మాట్లాడారు.

రాపాకపై జనసైనికులు ఫైర్
ఇదంతా చూసి జనసైనికులు రాపాకపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. జనసేన పార్టీ తరుపున గెలిచి అధినేత నిర్ణయానికి గౌరవం ఇవ్వకపోవడం నీ నీచ గుణానికి నిర్వచనం అంటూ ఫైర్ అవుతున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో శ్రీ రెడ్డి ఎంటరై సంచలన కామెంట్స్ చేసింది.
వెర్రి** అంటూ వరుస పోస్ట్‌లు
''రాపాక నువ్ కేక'' అంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తూ వరుస పోస్ట్‌లు పెట్టింది శ్రీ రెడ్డి. అంతేకాదు ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ బండబూతులు తిట్టింది. ''వెర్రి** పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పీకే భయంతో కాషాయం కప్పుకున్నాడు'' అంటూ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించింది.
చంద్రబాబుని హీరో చేస్తారు.. ఆ తర్వాత
''పీకే.. సింహాన్ని దూరంగా ఉండి చూడు. కెలికితే వేటాడేస్తాది. రాపాక మీరు కేకా'' అంటూ వరుస పెట్టి ఫేస్‌బుక్ పోస్ట్‌లు షేర్ వదిలింది శ్రీరెడ్డి. అంతేగాక మీడియాపై కూడా శ్రీ రెడ్డి బాణం వదిలింది. ''ఈ టీవీ ఛానల్స్ ఒకసారి చంద్రబాబుని హీరో అంటాయ్.. మరోసారి పీకేని ఆకాశానికి ఎత్తుతాయి. ఈ మీడియా నాకు అర్ధం కాదురోయ్'' అంటూ కామెంట్ పోస్ట్ చేసింది.

శ్రీ రెడ్డి క్లైమాక్స్
ఇన్నాళ్లు టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై విరుచుకు పడుతూ బూతు కామెంట్లు పెట్టిన శ్రీ రెడ్డి ఏకంగా వెండితెరపై తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతోంది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి వెండితెర రూపమివ్వబబోతోంది ఈ సంచలన తార. ఈ మేరకు క్లైమాక్స్ అనే సినిమా సెట్స్‌పై చేరింది శ్రీ రెడ్డి.