»   » టాలీవుడ్ హీరోలపై శ్రీరెడ్డి సంచలనం.. ఎన్టీఆర్ ఆ సినిమాలో నటించారు, రీల్ లైఫ్‌లో మాత్రమేనా!

టాలీవుడ్ హీరోలపై శ్రీరెడ్డి సంచలనం.. ఎన్టీఆర్ ఆ సినిమాలో నటించారు, రీల్ లైఫ్‌లో మాత్రమేనా!

Subscribe to Filmibeat Telugu
Sri Reddy Sensational Comments On Tollywood Star Heroes

కాస్టింగ్ కౌచ్ పై పోరాటం మొదలు పెట్టిన శ్రీరెడ్డి ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్థ నగ్న నిరసన చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఒక్కసారిగా ఆమె సంచలనంగా మారింది. తనని అవకాశాల పేరుతో వాడుకుని మోసం చేసిన ప్రముఖుల పేర్లని శ్రీరెడ్డి బయట పెడుతుండడంతో ఈ సంచలన తీవ్రత మరింతగా పెరిగింది. శ్రీరెడ్డి ప్రముఖుల గురించి నేరుగా మీడియా ముందే వ్యాఖ్యలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా శ్రీరెడ్డి టాలీవుడ్ హీరోలందరిపై విరుచుకుపడింది. వీళ్ళ కేవలం రీల్ హీరోలు మాత్రమేనా అంటూ ప్రశ్నించింది. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా శ్రీరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసింది.

ఎన్టీఆర్ ఆ చిత్రంలో నటించారు

ఎన్టీఆర్ ఆ చిత్రంలో నటించారు

ఎన్టీఆర్ రాఖి చిత్రంలో నటించాడు. చెల్లెలికి జరిగిన అన్యాయంపై, మహళలకు జరుగుతున్న అన్యాయాలపై ఆ చిత్రంలో ఎన్టీఆర్ పోరాడుతూ కనిపించారు అని శ్రీరెడ్డి తెలిపింది. రాఖి చిత్రం మంచి విజయం సాధించింది.

రీల్ లైఫ్ హీరోలు

రీల్ లైఫ్ హీరోలు

మన హీరోలు రీల్ హీరోలు అని రెడ్డి వ్యాఖ్యానించింది. రియల్ లైఫ్ లో కూడా హీరోలు కొన్ని మంచి పనులు చేస్తుంటారని వివరించింది. మొక్కలు నాటడం, స్వచ్ఛభారత్ లో పాల్గొనడం వంటి కార్యక్రమాలని హీరోలు చేస్తుంటారని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

అక్క, చెల్లెళ్ళు ఇబ్బంది పడుతున్నారు

అక్క, చెల్లెళ్ళు ఇబ్బంది పడుతున్నారు

ఈ హీరోలు ఉంటున్న ఇండస్ట్రీలోనే ఇంతమంది అక్క, చెల్లెళ్ళు ఇబ్బంది పడుతున్న సంగతి వారికి తెలియదా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. హీరోలంతా బయటకు వచ్చి ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి.. అని తెలుసుకుని సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయాలనీ శ్రీరెడ్డి కోరింది.

 హీరోలంతా కలసి

హీరోలంతా కలసి

టాలీవుడ్ లో ఉన్న హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు, రాంచరణ్ వంటి వారంతా పూనుకుని ముందుకు రావాలని శ్రీరెడ్డి కోరింది. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడదాం.. ఆయన ఇప్పుడు ఇండస్ట్రీని వదిలేసారు అంటున్నారు కాబట్టి అని శ్రీరెడ్డి తెలిపింది.

ఏమీ పట్టనట్లు ఎందుకు ఉంటున్నారు

ఏమీ పట్టనట్లు ఎందుకు ఉంటున్నారు

టాలీవుడ్ హీరోలంతా ఇక్కడ ఏమి జరగనట్లు, తమకు ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారని శ్రీరెడ్డి మండి పడింది. అలా ఉంటె రియల్ లైఫ్ హీరోలు కాదు అనేఆ అర్థం అని శ్రీరెడ్డి తెలిపింది.

మా ఏర్పాటు చేస్తున్న కమిటీలో

మా ఏర్పాటు చేస్తున్న కమిటీలో

తనకు మా ఏర్పాటు చేస్తున్న ఉమెన్ వింగ్ లో మెంబర్ గానో, అధ్యక్షురాలిగానో ఉండాలనే ఆసక్తి తనకు లేదని శ్రీరెడ్డి తెలిపింది. కానీ మా ఏర్పాటు చేయబోయే కమిటీ కోసం తాను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని శ్రీరెడ్డి తెలిపింది.

 ఒక్కరి చేతిలో ఉండకూడదు

ఒక్కరి చేతిలో ఉండకూడదు

మా ఏర్పాటు చేయబోయే కమిటీలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని శ్రీరెడ్డి కోరింది. షి టీం, పోలీస్ అధికారి, లాయర్, సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు ఇలా అని వర్గాల వారు భాగస్వాములు కావాలని శ్రీరెడ్డి కోరింది.

అప్పటికప్పుడు బట్టలు విప్పలేదు

అప్పటికప్పుడు బట్టలు విప్పలేదు

తాను చేసిన అర్థ నగ్న నిరసనపై వస్తున్న విమర్శల గురించి శ్రీరెడ్డి స్పందించింది. తాను అప్పటికప్పుడు బట్టలు విప్పలేదని శ్రీరెడ్డి తెలిపింది. నెలరోజులుగా తాను పోరాటం చేస్తున్నా ఎవరూ ముందుకు రాకపోవడంతోనే తాను ఆ విధంగా నిరసన తెలియజేసానని శ్రీరెడ్డి తెలిపింది.

English summary
Sri Reddy sensational comments on Tollywood Heroes. Sri Reddy demands tollywood heros to responds this issue
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X