నా కూతురు పెళ్లి, పిల్లలు .... అంటూ శ్రీదేవి ఊహించని కామెంట్!
ఝాన్వి కపూర్ సినిమాల్లోకి రావడం ఇష్టం లేదంటోంది శ్రీదేవి. అది తన మనసులోని మాట మాత్రమే అని ఆమె వెల్లడించారు.
ముంబై: సినిమా రంగానికి చెందిన వారు తమ వారసులను ఇదే రంగంలో దింపాలని ఆశ పడతారు. బాగా సక్సెస్ అయి తమ పేరు నిలబెట్టాలని కోరుకుంటారు. ఎందుకంటే ఈ రంగంలో వచ్చినంత పేరు, డబ్బు మరే రంగంలోనూ రాదు.
అయితే శ్రీదేవి మాత్రం తన ఇద్దరు కూతుళ్ల గురించి మాత్రం ఇలా ఆలోచించడం లేదు. వారు సినిమా రంగంలోకి రావడం ఆమెకు బొత్తిగా ఇష్టం లేనట్లే ఉంది. ఇన్నాళ్లు ఈ విషయాన్ని మనసులో దాచుకున్న శ్రీదేవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.

ఆమె సంతోషమే
ఏ తల్లి అయినా తన కూతురు సంతోషాన్ని కోరుకుంటుంది. వారు వీలైనంత త్వరగా జీవితంలో సెటిలై పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హీయిగా జీవించాలని ఆశ పడతారు. శ్రీదేవి మనసులో కూడా ఇలాంటి ఆలోచనే ఉంది.

ఓ తల్లిగా నేరు కోరుకునేది అదే
నా కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే చూడాలని ఆశపడుతున్నాను. అలా అని నేను ఝాన్వి కపూర్ సినిమాల్లోకి వెళ్లడాన్ని నేను వ్యతిరేకించడం లేదు అని శ్రీదేవి తెలిపారు.

ఆ సినిమాలో నటిస్తానంటే ఒప్పుకోలేదు
‘జాహ్నవి ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'లో నటిస్తానంటోంది. కానీ నేను ఒప్పుకోలేదు. అలా అని నేను ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడటం లేదు. ఒక తల్లిగా కూతురు సుఖం కోరుకునే ఇలా అంటున్నాను అని తెలిపారు.

నటిగా గుర్తింపు తెచ్చుకుంటే సంతోషమే
నా మనసులో ఏది ఉన్నా... నా సంతోషం కంటే నా కూతురి సంతోషమే నాకు ముఖ్యం. ఝాన్వి కపూర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటే ఓ తల్లిగా గర్వపడేది కూడా నేను అని శ్రీదేవి తెలిపారు.

సైరాట్ ద్వారా
శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న ‘సైరాట్' చిత్రంలో షాహిద్ తమ్ముడు ఇషాన్‌తో కలిసి నటించనున్నట్లు సమాచారం. మరాఠీలో సూపర్ హిట్టయిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











