»   » కూతురుపై శ్రీదేవి కొత్త ఆంక్షలు: ఫోటోలు కూడా వీల్లేదంటూ కట్టడి

కూతురుపై శ్రీదేవి కొత్త ఆంక్షలు: ఫోటోలు కూడా వీల్లేదంటూ కట్టడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

జాన్వీ కపూర్ అరంగేట్రం కోసం శ్రీదేవి తెరవెనుక ప్రయత్నాలు చాలానే చేస్తోంది. కూతురు తొలిసినిమానే ఆమె కెరీర్ కి గట్టి పునాది అవ్వాలని బాగానే తపన పడుతోంది. అసలు బాలీవుడ్ లోనే జాన్వీ ఎంట్రీ అనేది గ్రాండ్ గా ఉందాలనుకుంటోందో అంతకంతా జాన్వీ మరీ ఆ ప్రయత్నాలని నీరు గార్చేస్తోంది. అంటే సినిమాలు చేయనని చెప్పటం కాదు.

ఎప్పటికప్పుడు తాను సోషల్ మీడియాలో అందుబాటులోఉంతూ. విచ్చల విడిగా ఫొటోలని గుప్పించేస్తోంది. ఇక బయట పార్టీలలో ఫొటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కటం మామూలే. ఇప్పటికే జాన్వీ ఫొటోలు కుప్పలు తెప్పలుగా నెట్ లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా మరీ ఎక్కువగా కనిపించేస్తూంటే సినిమా వచ్చేనటికి పెద్దగా ఎక్సైట్ మెంట్ ఉండదనీ ఫీలవుతోందట శ్రీదేవి.

Sridevi condition to her daughter Jhanvi

అందుకే ఇప్పుడు జాన్వీ ప్రతీ కదలికనీ తానే దగ్గరుండి చూసుకుంటోంది శ్రీదేవి . స్టైలింగ్ నుంచి ప్రతీ విషయంలోనూ కేర్ తీసుకుంటోంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఈ భామకు.. ఇప్పుడీ అందాల మమ్మీ కొత్త రూల్ పెట్టిందట. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఫోటోలను సోషల్ మీడియాలో రివీల్ చేయద్దని చెప్పిందట. ఎప్పటికప్పుడు ఆమె లుక్స్ బైటకు వచ్చేస్తుండడంతో.. కూతురు సినీ ఎంట్రీపై హైప్ క్రియేట్ అవదని. ఇకనుంచీ అసలు జాన్వీ లుక్ బయటకనిపించకూడదనీ ఆంక్షలు పెట్టేసిందట.

గతంలో కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదంటూ ఉన్నా బయట పార్టీల్లో కనిపించకూదదంటూ చెప్పినట్టు వార్తలు వినిపించాయి. బాలీవుడ్‌లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియాతో చేసిన లిప్ కిస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో శ్రీదేవికి కోపమొచ్చింది. శిఖర్‌తో జాన్వీ డేటింగ్‌పై మీడియాలో వార్తలొస్తుండటంతో శ్రీదేవి హెచ్చరించినట్లు బాలీవుడ్ లో గుసగుసలు పోయారు.

Sridevi condition to her daughter Jhanvi

బాయ్ ఫ్రెండ్స్, డేటింగ్ వంటివే కాదు, కనీసం యువకులతో స్నేహం చేసినా తాను ఒప్పుకోనని జాన్వీకి శ్రీదేవి గట్టిగా చెప్పిందని అనుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా అసలు ఫొటో లే బయటకు రాకూడదంటూ కండిషన్ పెట్టేసిందట. అయినా శ్రీదేవి చెప్పేదీ నిజమే కదా. కూతురు కెరీర్ పై ఆమాత్రం కఠినంగా ఉండటం లో తప్పేం లేదంటూ రాసేసింది ఒక బాలీవుడ్ వార్తల వెబ్ సైట్

English summary
Sridevi is now not at all happy with the future of her elder daughter. The sources are said to be strange that the actress imposed some no boy friend and no dating clause for the girl soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu