For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీదేవి మరణంపై పలు సందేహాలు.. అతి జాగ్రత్తే కొంప ముంచిందా? పరదేశంలో..

  By Rajababu
  |

  భారతీయ సినిమా పరిశ్రమ చరిత్ర పుటలో గ్లామర్ క్వీన్ శ్రీదేవిది ఓ అధ్యాయమే ఉంటుంది. తమిళ, మలయాళ పరిశ్రమలో నుంచి మెల్లగా తన అందంతో తెలుగు వారి హృదయాల్లోకి చేరింది. తెలుగులో అగ్రతారగా వెలుగుతూనే హిందీ ప్రేక్షకులను సమ్మోహితం చేసింది. పెళ్లి తర్వాత వెండితెరకే కాదు.. జనజీవన స్రవంతికి దూరమైందనే భావన కల్పించింది. ఈ మధ్యకాలంలోనే మళ్లీ మీడియాలో హడావిడి చేసింది. అదే అందం, అదే గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా మెరిసింది. కానీ ఇటీవల కాలంలో మరీ బలహీనంగా కనిపించింది. ఆరోగ్యం, అందంపై శ్రీదేవి అతిశ్రద్దే అందుకు కారణమనే మాట వినిపిస్తున్నది.

  శ్రీదేవి మరణంతో బాలీవుడ్ షాక్ : ట్విట్టర్లో ప్రముఖుల సంతాపం!
  తారల నుంచి పోటిని తట్టుకునేందుకు

  తారల నుంచి పోటిని తట్టుకునేందుకు

  శ్రీదేవి సినీ జీవితాన్ని పరిశీలిస్తే.. అందం కాపాడుకోవడంలో ఆమె అనేక మార్లు తగిన జాగ్రత్తలు తీసుకొన్నది. జయప్రద, జయసుధ లాంటి సహచర హీరోయిన్ల నుంచి వచ్చే పోటీని తట్టుకోవడానికి ఎప్పటికప్పుడు తన అందానికి మెరుగులు దిద్దుకొనేది.

  కెరీర్‌లో అనేక సర్జరీలు

  కెరీర్‌లో అనేక సర్జరీలు

  తన అందాన్ని మెరుగులు దిద్దుకొనే క్రమంలో ముక్కు కోసం సర్జరీ, పళ్లు ఎత్తుగా కనిపించకుండా డెంటల్ సర్జరీ లాంటివి చేయించుకొన్నది. అలా పోటీని తట్టుకొనేందుకు అనేక చికిత్సలు, ఆరోగ్య నియమ, నిబంధనల వలయంలో తనకు తెలియకుండానే చిక్కుకుపోయింది.

  తాపత్రయం.. ఆరాటం..

  తాపత్రయం.. ఆరాటం..

  దక్షిణాది చిత్ర పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నంతకాలం కొత్తగా వచ్చిన ప్రతీ హీరోయిన్‌తో పోటీకి సై అన్నది. వైవిధ్యమైన పాత్రలు పోషించడానికి తాపత్రయం పడుతూనే ఉంది. బాలీవుడ్‌లో కూడా శ్రీదేవికి అదే పరిస్థితి ఎదురైంది.

  బాలీవుడ్‌లోనూ అదే పరిస్థితి

  బాలీవుడ్‌లోనూ అదే పరిస్థితి

  బాలీవుడ్‌లో కెరీర్ తొలినాళ్లలో రేఖ హవా నడుస్తున్నది. రేఖ ఆధిపత్యానికి గండి కొట్టడంలో సఫలమైంది. ఆ తర్వాత జయప్రద, మాధురీలతో నువ్వా నేనా అనే విధంగా పోటీని ఎదుర్కొన్నది. ప్రతీ ఒక్కరితో పోటీ పడుతూ అందానికి సర్జరీలు చేయించుకుంటూ ఇబ్బందులు పడుతూనే ఉండేది.

  అభిమానులకు షాకిచ్చిన శ్రీదేవి

  అభిమానులకు షాకిచ్చిన శ్రీదేవి

  ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీదేవి పాల్గొన్నది. ఆ ఫంక్షన్‌లో ఆమెను చూసిన వాళ్లంతా షాక్‌ అయ్యారు. చాలా సన్నగా, పీలగా అంతేకంటే ముఖ్యంగా బలహీనంగా కనిపించింది.

  ఆరోగ్యంలో ఏదో తేడా

  ఆరోగ్యంలో ఏదో తేడా

  అందం ముసుగులో ఆమె ఆరోగ్యానికి ఏదో అవుతుందనే విషయాన్ని గ్రహించిందో లేదో తెలియదు. ఆమెను కళ్లప్పగించి చూసినవాళ్లు శ్రీదేవి ఆరోగ్యంలో ఏదో తేడా ఉంది అనే విషయాన్ని గ్రహించారు. అలా అనుకొంటూ ఉంటుండగానే సరిదిద్దుకోలేని విపత్తు జరిగిపోయింది.

  తిరిగి రాని లోకాలకు

  తిరిగి రాని లోకాలకు

  ఇంకా ఎన్నో ఏళ్లు తెరమీద మ్యాజిక్ చేస్తుందనే ఆశపడ్డ అభిమానులను అనాధలుగా చేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. దుబాయ్‌లో ఓ పెళ్లికి హాజరైన ఆమె పరదేశంలోనే పరలోకానికి వెళ్లిపోయింది. ప్రేక్షకలోకాన్ని పట్టించుకోకుండా ఆమె మనం చూడలేని లోకానికి వెళ్లిపోయింది.

  శ్రీదేవి మరణాన్ని పరిశీలిస్తే

  శ్రీదేవి మరణాన్ని పరిశీలిస్తే

  ప్రపంచ ప్రఖ్యాత పాప్‌ సింగర్ మైఖేల్‌ జాక్సన్‌ లైఫ్ అక్కడో ఎక్కడో చాలా దగ్గరి పోలికలు కనిపిస్తాయి. గ్లామర్ పరంగా ఇద్దరి ఆలోచనా స్వరూపం ఒక్కేలా ఉంటుంది. కాలంతోపాటు వచ్చే మార్పుల్ని స్వాగతించలేనివాళ్లు. ముఖంపై చిన్న మడత వస్తే తట్టుకోలేని వీళ్లిద్దరి జీవితాంతం సర్జరీలతో కాలం గడిపారు.

  మైఖేల్ జాక్సన్ కూడా

  మైఖేల్ జాక్సన్ కూడా

  చలాకీగా, సన్నగా ఉండట కోసం ఆహారానికి దూరమై ట్యాబ్లెట్లతోనే కాలం గడిపారు. మైఖేల్‌ జాక్సన్‌ పోస్ట్‌మార్టం తర్వాత రిపోర్ట్‌లో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన కడుపులో సరిగ్గా జీర్ణం కాని విటమిన్‌ ట్యాబ్లెట్లు చాలా ఉన్నాయనే విషయం ప్రేక్షక లోకాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది. సరిగ్గా తిన్నామా, పడుకున్నామా అని పట్టించుకోకుండా పరుగుపెట్టాడు. చివరకు ఓ రోజు రాత్రి గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు శ్రీదేవి జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసింది.

  అందం మాటున

  అందం మాటున

  గ్లామర్ ప్రపంచంలో అందం చాలా అవసరం. అయితే అందమే జీవితం కాదు. అందం మాటున ఆనందం కూడా అవసరమనే విషయాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. అందం కాపాడుకొనే క్రమంలో విషమ పరిస్థితిని కొని తెచ్చుకొంటున్నారు.

  బాలీవుడ్ తార రేఖ

  బాలీవుడ్ తార రేఖ

  శ్రీదేవి కంటే ముందు బాలీవుడ్‌కి వచ్చిన రేఖ ఇప్పటికీ ఎంతో అందంగానూ, చలాకీగానూ కనిపిస్తారు. ఆమె ముఖంపై ముడుతలు ఉన్నప్పటికీ వాటిని ఆమె తన చిరునవ్వుతో జయిస్తారు. కానీ శ్రీదేవి అలా జయించలేకపోయింది. ఇంకా చిన్నపిల్లలానే కన్పించాలని ఆత్యాశ, ఆతృత ఏమో తన వయసుని, వయసుతో వచ్చే మార్పుల్ని ఆహ్వానించలేకపోయింది. ఫలితంగా అతిలోక సందరి ఓ అర్థరాత్రి అనంతలోకాలకు వెళ్లిపోయింది.

  English summary
  Veteran Bollywood actor and Padma Shri awardee Sridevi, who had an illustrious career spanning over four decades, passed away. She was 54. Sridevi, died late in the night reportedly due to cardiac arrest in Dubai, where she had gone along with her family to attend her nephew Mohit Marwah's wedding. Confirming the news, a source close to the family said, "Yes it's true. She was in Dubai while some of the other family members came back to India. We hear it's cardiac arrest. In this situation some doubts raised on her health issues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X