»   » భర్త బోనికి దూరంగా.. శ్రీదేవి షాకింగ్ నిర్ణయం.. జర్నీ ముగిసింది.. ఏం జరిగిందంటే...

భర్త బోనికి దూరంగా.. శ్రీదేవి షాకింగ్ నిర్ణయం.. జర్నీ ముగిసింది.. ఏం జరిగిందంటే...

Written By:
Subscribe to Filmibeat Telugu

పెళ్లి, ఇద్దరు పిల్లల సంతానం తర్వాత శ్రీదేవి మళ్లీ బాలీవుడ్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకొన్నారు. ప్రస్తుతం ఆమె దృష్టంతా త్వరలో విడుదల కానున్న మామ్ సినిమాపైనే. ఈ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలో పూర్వ వైభవాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Sridevi did not talk with hubby Boney Kapoor for three months

నిర్మాత బోనికపూర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు రవీ ఉద్యవార్ కలయికలో రూపొందుతున్న మామ్ చిత్రం జూలై 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది. అయితే సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు భర్త బోనికపూర్‌తో దాదాపు మూడు నెలలు మాట్లాడలేదని చెప్పుకొచ్చింది.

మూడు నెలలు మాట్లాడలేదు

మూడు నెలలు మాట్లాడలేదు

మామ్ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. మూడు నెలలపాటు బోనికపూర్‌తో మాట్లాడలేదు. ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పాను. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత గుడ్ నైట్ అంటూ విష్ చేసేదాన్ని. మూడు నెలలపాటు మా మధ్య జరిగిన సంభాషణ అదే. అంతకంటే ఎక్కువగా ఏమీ మాట్లాడుకోలేదు అని చెప్పారు. మామ్ సినిమా జర్నీ ముగియడంతో మళ్లీ మాములుగా మారాం అని అన్నారు.

దర్శకుడి మాటను జవదాటలేదు

దర్శకుడి మాటను జవదాటలేదు

నేను స్వతహాగా డైరెక్టర్ యాక్టర్‌ను. సినిమా ఒప్పుకొంటే పూర్తిగా దర్శకుడి మాటనే వింటాను. అలాగే రవి ఉద్యయార్ మాట జవదాటలేదు. ఆయన విజన్‌కు అనుకూలంగా వ్యవహరించాను. మామ్ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అని శ్రీదేవి అన్నారు.

నిర్మాతగా ఇబ్బంది పడకుండా

నిర్మాతగా ఇబ్బంది పడకుండా

ఓ నిర్మాతగా బోనికపూర్‌ను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఆయన దృష్టిని నిర్మాణంపై నుంచి మరల్చకుండా జాగ్రత్తలు తీసుకొన్నాను. సినిమా మొదలైనప్పటి నుంచి ఆయనను నిర్మాతగానే చూశాను. ఆయనకూ పూర్తి స్వేచ్ఛను ఇచ్చాను. అందుకే ఆయన పనిలో జోక్యం కలిగించుకోకుడదనే కారణంతో దూరంగా ఉన్నాను అని శ్రీదేవి వెల్లడించారు.

భావోద్వేగమైన కథ ఇది..

భావోద్వేగమైన కథ ఇది..

ఈ చిత్రంలో దేవకీ అనే పాత్రను పోషిస్తున్నాను. నా కుమార్తెగా ఆర్య నటించింది. ఇది చాలా భావోద్వేగమైన కథ. నా కుమార్తెకు జరిగిన అన్యాయంపై చేసిన పోరాటమే సినిమా కథ అని శ్రీదేవి చెప్పింది. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ, అక్షయ్ కుమార్ తదితరులు నటించారు.

శ్రీదేవికి బోని అరుదైన గిఫ్ట్

శ్రీదేవికి బోని అరుదైన గిఫ్ట్

ఈ చిత్రం శ్రీదేవికి మరిచిపోలేనటువంటి చిత్రంగా మారనున్నది. ఎందుకంటే శ్రీదేవి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి జూలై 7వ తేదీకి 50 ఏళ్లు పూర్తవుతాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అదే రోజు మామ్ సినిమాను విడుదల చేసి శ్రీదేవికి ఓ అరుదైన బహుమతిగా అందించాలని బోని కపూర్ నిర్ణయించారు.

English summary
While working on Mom, Sridevi decided to treat Boney Kapoor as her producer alone and stopped talking to him for three months!. During the trailer launch of the movie Sridevi said, “For three months, I did not speak to Boney Ji as a husband. I used to greet him good morning and after pack up, I used to wish him goodnight- that’s all we spoke. That was the only conversation I had with him.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu