»   » బాహుబలి గురించి ఇపుడు అనవసరం: శ్రీదేవి కామెంట్

బాహుబలి గురించి ఇపుడు అనవసరం: శ్రీదేవి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి సినిమా విడుదలవ్వడం, సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం, భారీ వసూళ్లు సాధించడం, చివరకు థియేటర్ల నుండి సినిమాను తీసేయకూడా జరిగి పోయింది ఇపుడు ఆ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దానికి గురించి ఇపుడు అనవసరం' అంటూ మీడియాపై మండి పడింది ప్రముఖ నటి శ్రీదేవి.

తను నటించిన తమిళ మూవీ ‘పులి' చిత్రం అక్టోబర్లో విడుదలవుతున్న నేపత్యంలో ప్రస్తుతం ఆమె సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె బాహుబలి ఆఫర్ ఎందుకు తిరస్కరించారనే ప్రశ్నలు ఎదువుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి పై విధంగా స్పందించారు.

పులి సినిమా గురించి ఆమె మాట్లాడుతూ..‘ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా తర్వాత సినిమాలేవీ చేయలేద. కొత్త రకం స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నాను. పులి సినిమాలోని ఫాంటసీ ఎలిమెంట్స్ నాకు ఎంతో నచ్చాయి. ఈ సినిమాలో నాకు మహారాణి పాత్ర చేసే అవకాశం వచ్చింది, ఎంతో ముఖ్యమైన పాత్ర అందుకే ఒప్పుకున్నాను. ప్రేక్షకులు నేను చేసిన పాత్రను ఎలా స్వీకరిస్తారో చూడాలి. ' అని శ్రీదేవి చెప్పుకొచ్చింది.

బాహుబలి సినిమాలో శివగామి పాత్ర చేసేందుకుగాను శ్రీదేవి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని, రాజమౌళి అండ్ టీం అంత ఇవ్వలేమని చెప్పడంతో తన డేట్స్ ఖాళీగా లేవనే సాకుతో నో చెప్పిందనే ప్రచారం గతంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పాత్రను రమ్య కృష్ణ పోషించి ఆమె తప్ప ఆ పాత్రలో వేరొక నటి సూట్ కారనే రేంజిలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.స

English summary
"Baahubali has released, ran in theatres and left. What's the need to talk about that film now? It's unnecessary", says actress Sridevi.
Please Wait while comments are loading...