For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కష్టంగా ఉంది కానీ తప్పటం లేదు: శ్రీదేవి

  By Srikanya
  |

  ముంబై : శ్రీదేవి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఇంగ్లీష్-వింగ్లీష్'. ఈ సినిమాలో నటించడం కంటే ఆ సినిమా గురించి పబ్లిసిటీ చేయడమే కష్టంగా ఉందని శ్రీదేవి అంటున్నారు. గత కొద్దిరోజులుగా ఈ చిత్రం ప్రమోషన్ లో కంటిన్యూగా పాల్గొంటున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ నటన కష్టంగా లేదని, ఇలా పబ్లిసిటి కోసం తిరగటమే కష్టంగా ఉందంటూ వాపోయారు. మారుతున్న కాలంలో సినిమాకన్నా పబ్లిసిటీ పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోందని,తాను ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నానని అన్నారు. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా అక్టోబర్‌ 5న విడుదలయ్యే ఈ చిత్రం 2గం10నిల సేపు ప్రదర్శితమయ్యేలా రూపొందింది.

  ఇంగ్లీష్‌ తెలియక ఇబ్బందులు పడే ఓ గృహిణికి సంబంధించిన ఇతివృత్తంగా 'ఇంగ్లీష్‌ వింగ్లిష్‌' చిత్రాన్ని శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించగా ఆర్‌.బాల్కి నిర్మించారు. 14 సంవత్సరాల అనంతరం శ్రీదేవి ఈ చిత్రంలో నటించడం వల్ల అధిక అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు ప్రియా ఆనంద్‌ ఈ చిత్రం ద్వారా హిందీ తెరకు పరిచయం అవడం ఒక విశేషం అయితే, గౌరి షిండే తొలిసారి దర్శకత్వం చేపట్టడం మరో విశేషం. పదిహేను సంవత్సరాల తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చిన తనకు నటించడం పెద్దగా కష్టంగా అనిపించకున్నా తాను నటించిన సినిమా గురించి ప్రచారం చేయడం కష్టంగా అనిపిస్తోందని చెప్పింది. అయితే ఈ ఆధునిక పోకడలకు కూడా మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్నానని, ప్రచారాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నానంది.

  ఈ వయస్సులో కూడా హీరోయిన్ గా నటించడాన్ని ఎంజాయ్ చేశానని, షూటింగ్ కూడా సాఫీగానే సాగిపోయిందని చెప్పారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఓ సినిమాలో కష్టపడి నటించడం ఒక సవాలైతే దానిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం అంతకంటే పెద్ద సవాలుగా మారిందని, ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా కోసం చేస్తున్న పబ్లిసిటీతో తనకు ఆ విషయం తెలిసొచ్చిందని చెప్పింది. తాను హీరోయిన్‌గా కొనసాగిన ఎనభైవ దశకంలో కేవలం సినిమాలో నటిస్తే సరిపోయేదని, అంతగా అవసరమైతే ఒకటో రెండో పత్రికలకు ఇంటర్వ్యూ ఇస్తే సరిపోయేదని, కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పింది. సినిమాలో నటించడం కంటే దానిని ప్రచారం చేయడం కోసమే ఎక్కువగా శ్రమించాల్సి వస్తోందని చెప్పింది.

  'ఇంగ్లీష్‌ - వింగ్లీష్‌'సినిమా గురించి చెపుతూ...దర్శకురాలు గౌరి... 'ఇంగ్లీష్‌ - వింగ్లీష్‌' కథ చెప్పగానే ఒప్పుకొన్నారట కదా...అవును. నా మనసుకి అంతలా నచ్చింది. ఇందులో ఓ సామాన్య గృహిణిలానే కనిపిస్తాను. భాష రాకపోతే.. ఎన్ని సమస్యలొస్తాయి అనే విషయాన్ని వినోదం జోడించి చెప్పారు. నా జీవిత అనుభవాలు కూడా పనికొచ్చాయి. ఎందుకంటే నేను భాష తెలియని చోట కూడా పనిచేశాను. అప్పుడూ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నా అన్నారు. ఆదిల్ హుస్సేన్, ప్రియాఆనంద్, మెహదీ నెబ్బో తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌త్రివేది, కెమెరా: లక్ష్మణ్ ఉటేకర్, ఎడిటింగ్: హేమంతిసర్కార్, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.దమని, సునీల్‌లల్లూ, ఆర్.బాల్కీ, రచన, దర్శకత్వం: గౌరీషిండే.

  English summary
  Sridevi, who makes her big screen comeback after 15 years, says she's yet to get used to the aggressive marketing strategies. Sridevi said that the industry and the media during her heydays weren't so high on promotional events."Even during the '90s, there were limited interviews which were conducted by few magazines and some known publications, unlike today, when interviews and promotions play a very crucial role in marketing a film," Sridevi said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X