»   » శ్రీదేవి చూసి భోరున విలపించిన అర్జున్‌కపూర్, సల్మాన్, ఐశ్వర్య.. 2 గంటలకు అంతిమయాత్ర

శ్రీదేవి చూసి భోరున విలపించిన అర్జున్‌కపూర్, సల్మాన్, ఐశ్వర్య.. 2 గంటలకు అంతిమయాత్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల నటి శ్రీదేవి పార్దీవ దేహాన్ని సినీ ప్రముఖులు, వేలాది అభిమానులు కడసారి దర్శించుకొంటున్నారు. దుబాయ్‌లో శనివారం రాత్రి మరణించిన శ్రీదేవి భౌతికకాయాన్ని మంగళవారం రాత్రి ముంబైలొని తన నివాసానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత రాత్రి నుంచి పలువురు ప్రముఖులు శ్రీదేవి పార్ధీవదేహానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

Sridevi's Mortal At Celebration Sports Club, Watch | Oneindia Telugu
సంతాప సభ నిర్వహణ

సంతాప సభ నిర్వహణ

బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు అంధేరిలో సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో సంతాప సభను బాలీవుడ్ ప్రముఖులు నిర్వహించారు. ఈ సభలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, సుస్మితాసేన్ తదితరులు హాజరయ్యారు.

3.30 గంటలకు అంతిమయాత్ర

3.30 గంటలకు అంతిమయాత్ర

శ్రీదేవి అంతిమయాత్రను దాదాపు 7 కిలోమీటర్లపాటు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పవన్ హాన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి అంత్యక్రియలు ప్రారంభవుతాయి.

మీడియాకు థ్యాంక్స్ ప్రకటన

మీడియాకు థ్యాంక్స్ ప్రకటన

శ్రీదేవి మృతి నేపథ్యంలో మీడియా, అభిమానులు అందించిన సహాకారానికి ధన్యవాదాలు అంటూ కుటుంబ సభ్యులు ప్రకటన రిలీజ్ చేశారు. జాహ్నవి, బోనికపూర్, కపూర్ కుటుంబం, అయ్యప్పన్ కుటుంబం తరఫున ప్రకటన రిలీజ్ చేశారు.

విలపించిన సల్మాన్

విలపించిన సల్మాన్

ఇదిలా ఉండగా శ్రీదేవి భౌతికకాయాన్ని దర్శించుకొన్న సినీ ప్రముఖుల్లో సల్మాన్ ఖాన్ ఆమెను చూసి భోరున విలపించారు. పొంగి వస్తున్న దు:ఖాన్ని ఆపుకొనేందుకు ప్రయత్నించారు.

ఐశ్వర్యరాయ్ కంటతడి

ఐశ్వర్యరాయ్ కంటతడి

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ కూడా కంటతడి పెట్టుకొన్నారు. భావోద్వేగానికి లోనైన కన్నీటి పర్యంతమయ్యారు. బచ్చన్ కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించారు.

భోరున విలపించిన అర్జున్ కపూర్

భోరున విలపించిన అర్జున్ కపూర్

ఇక అర్జున్ కపూర్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. తన సవతి తల్లితో పెద్దగా సంబంధాలు లేవనే వార్తలు మీడియాలో వచ్చినప్పటికీ.. శ్రీదేవి మరణంతో అర్జున్ కపూర్ కుంగిపోయారు. మీడియా స్పందన కోరినప్పుడు తన కంటతడిని దాచుకొనేందుకు ప్రయత్నించారు. ఓ దశలో భోరున విలపించాడు.

English summary
It's still hard to believe that legendry actress Sridevi is no more. She passed away at the age of 54 on February 24. Accidental drowning was mentioned as the cause of death in the forensics report. Sridevi's mortal remains were brought to Mumbai last night on Feb 27. The condolence meeting started today from 9.30 am to 12.30 pm at Celebrations Sports Club, Andheri. Aishwarya Rai Bachchan, Sushmita Sen and other Bollywood stars have reached the venue to pay their last respect.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu