»   » రూమర్స్ పై మండిపడుతున్న శ్రీదేవి భర్త

రూమర్స్ పై మండిపడుతున్న శ్రీదేవి భర్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ సూపర్ ‌హిట్ అయిన అత్తకుయముడు అమ్మాయికి మొగుడు చిత్రాన్ని ఇప్పటి తరంవారికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి, రామ్ ‌చరణ్ ‌తో తెరకెక్కించే ఆలోచన వుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయనే సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో రామ్ ‌చరణ్, జాహ్నవి హీరో, హీరోయిన్స్ గా చేస్తారని, హీరో అత్తగా శ్రీదేవి నటించడానికి ఇష్టపడుతున్నారని కంటిన్యూగా వినపడుతోంది. అయితే దీనిపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ మండిపడుతున్నాడు. దానికి ఆయన జాహ్నవి వయస్సు ఎంత కేవలం పదమూడేళ్ళు...ఎలా ఆమెను హీరోయిన్ పరిచయం చేస్తామని రాస్తున్నారు అన్నారు. అలాగే శ్రీదేవి అత్తగా నటిస్తుందనే విషయాన్ని ఖండిస్తూ...ఓ నెగిటివ్ రోల్ తో నిన్నటి స్టార్ హీరోయిన్ ఎలా రీఎంట్రీ ఇస్తుందనుకుంటున్నారు..కాస్త ఆలోచించండి...ఎంత సిల్లీగా ఉందో అన్నారు...అదీ మ్యాటర్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu