»   » పబ్లిక్ టాయ్‌లెట్స్ ప్రారంభోత్సవంలో హీరోయిన్ శ్రీదేవి (ఫోటోస్)

పబ్లిక్ టాయ్‌లెట్స్ ప్రారంభోత్సవంలో హీరోయిన్ శ్రీదేవి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటి శ్రీదేవి ముంబైలో జరిగిన పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీదేవి రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. స్లైడ్ షోలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు చూడొచ్చు.

శ్రీదేవి సినిమాల విషయానికొస్తే...
నిర్మాత బోనీ కపూర్ తో వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన శ్రీదేవి దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆ మధ్య ‘ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ ఆమె ఏ సినిమాలోనూ నటించలేదు. తాజాగా విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న ‘పులి' చిత్రంలో శ్రీదేవి నటించడానికి ఒప్పుకుంది.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కోలీవుడ్ లో అడుగిడిన 51 ఏళ్ల శ్రీదేవి చాలా శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె ఖరీదైన ఆభరణాలు, కిరీటాలతో ఇప్పుడు పూర్తిస్థాయి మహారాణి పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన 55 సెకన్ల టీజర్ ను సోమవారం విడుదల‌చేశారు. విజయ్ యుద్ధ సన్నివేశంతో ఈ టీజర్ మొదలవుతుంది. ఈగ ఫేం సుదీప్, శ్రుతిహాసన్ కూడా ఇందులో ఉన్నారు. చింబు దేవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హాలీవుడ్ లోని గ్లాడియేటర్ తరహాలో ఉంటుందని చెబుతున్నారు.

శ్రీదేవి

శ్రీదేవి

పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభోత్సవంలో శ్రీదేవి.

ఫ్యాన్స్

ఫ్యాన్స్

శ్రీదేవిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

అవగాహన

అవగాహన

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో టాయిలెట్స్ వాడకంపై అవగాహన కల్పించారు.

శ్రీదేవి

శ్రీదేవి

మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

English summary
Bollywood Actress Sridevi Inaugurates Public Sulabh Toilet In Mumbai on August 09, 2015.
Please Wait while comments are loading...