»   » అందాల దేవత మళ్లీ ఎప్పుడోస్తావు.. పుట్టెడు దు:ఖంలో ముంచావు.. నీ కోసమే ఎదురుచూపులు!

అందాల దేవత మళ్లీ ఎప్పుడోస్తావు.. పుట్టెడు దు:ఖంలో ముంచావు.. నీ కోసమే ఎదురుచూపులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాలుగు దశాబ్దాలకుపైగా సినీ ప్రేక్షక లోకాన్ని తన అందంతో సమ్మోహితం చేసి గ్లామర్ క్వీన్ శ్రీదేవి ఇక లేరు. శనివారం రాత్రి గుండెపోటుతో దుబాయ్‌లో ఆమె మరణించారు. బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్‌తో కలిసి శ్రీదేవి దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.

శ్రీదేవి మృతితో సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పటికే శ్రీదేవి ఇంటికి వారి ఫ్యామిలీ సన్నిహితులు, సినీరంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆదివారం అర్థరాత్రికి శ్రీదేవి పార్దీవదేహం ముంబైకి చేరుకొంటుంది. సోమవారం శ్రీదేవి అంత్యక్రియలు జరుగుతాయి.

బాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా

బాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా

బాలీవుడ్‌లో ఫిమేల్ సూపర్ స్టార్‌గా పేరొందిన శ్రీదేవి 13 ఆగస్టు 1963వ తేదీన జన్మించారు. ఆమె అసలు పేరు అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌. 1996లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో శ్రీదేవి వివాహం జరిగింది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు.

బాలనటిగా చిత్రపరిశ్రమలోకి

బాలనటిగా చిత్రపరిశ్రమలోకి

బాలనటిగా కందన్ కరుణ్ సినిమాతో 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్‌గా అలరించారు. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంతో రెండో ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించిన శ్రీదేవి, ఆ తరువాత తమిళంలో పులి చిత్రంలోను, చిట్టచివరిగా 2017లో మామ్ సినిమాలోను నటించారు. ఇప్పటి వరకూ 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు పొందిన శ్రీదేవిని 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.

అనతికాలంలోనే శ్రీదేవి

అనతికాలంలోనే శ్రీదేవి

అందంతో ఆకట్టుకొంటూ శ్రీదేవి అనతికాలంలోనే అగ్ర కథానాయిక అని పేరు తెచ్చుకొన్నది. తన నటనా జీవితాన్ని బాలనటిగా కన్దన్ కరుణాయ్ (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టిన అంచెలంచెలుగా ఎదిగింది. తొలుత తమిళ, మలయాళ చిత్రాలలో నటించారు. ఆ తర్వాత తెలుగులోకి ప్రవేశించారు. తెలుగు సినీ రంగాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా శాసించారు.

బోనికపూర్‌తో పెళ్లి

బోనికపూర్‌తో పెళ్లి

అయితే మిథున్‌తో పెళ్లి ఎంతవరకూ నిజం అనేదానికి తగిన ఆధారాలు మాత్రం లేవు. తర్వాత కాలంలో ఆమె హిందీ సినీ నిర్మాత, ఆమెతో కలసి ఎన్నో సినిమాలలో నటించిన హీరో అనిల్ కపూర్ సోదరుడు అయిన బోనీకపూర్‌ను 1996 జూన్ 2న వివాహం చేసుకొన్నారు.

తల్లి మరణవార్త వినగానే

తల్లి మరణవార్త వినగానే


తల్లి మరణవార్త వినగానే పెద్ద కూతురు జాన్వీ కూడా షూటింగ్ నుండి వెళ్ళిపోయినట్లుగా సమాచారం. శ్రీదేవి మరణించారనే వార్తని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దడక్ చిత్ర షూటింగ్ కారణంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఈ పెళ్ళికి వెళ్లలేదని సమాచారం.

హిందీలో తొలి సినిమా

హిందీలో తొలి సినిమా

1978లో శ్రీదేవి తొలిసారి హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. అమోల్ పాలేకర్‌తో సోల్వా సావన్ అనే చిత్రంలో నటించారు, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించలేదు.

హిమ్మత్‌వాలా సూపర్ హిట్

హిమ్మత్‌వాలా సూపర్ హిట్

జితేంద్ర గారితో కలిసి నటించిన హిమ్మత్‌వాలా చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత శ్రీదేవిని ఉత్తర భారతదేశంలో థండర్ థౌస్ అని పిలిచారు.

మిథన్‌తో అఫైర్.. పెళ్లి

మిథన్‌తో అఫైర్.. పెళ్లి

కొన్ని కథనాలు శ్రీదేవి కొంతకాలం బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తితో సహజీవనం చేసింది. వారిద్దరకూ రహస్యంగా వివాహం చేసుకొన్నారు, అతడు తన మొదటి భార్య అయిన గీతాబాలికి విడాకులు ఇవ్వని కారణంగా అతడికి దూరమయింది అని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది.

శ్రీదేవి చ‌నిపోలేదు.. ప్రేక్ష‌కుల గుండెల్లో ఎప్ప‌టికీ..

శ్రీదేవి చ‌నిపోలేదు.. ప్రేక్ష‌కుల గుండెల్లో ఎప్ప‌టికీ..

శ్రీదేవి గురించి ఇలాంటి ఒక సంద‌ర్భం వ‌స్తుంద‌ని అనుకోలేదు. ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని నిజంగా నేనెప్పుడూ ఊహించ‌లేదు. ఇది దుర‌దృష్టం. అందం అభిన‌యం క‌ల‌బోసిన న‌టి శ్రీదేవి. అత్య‌ద్భుత న‌టి. ఇలాంటి న‌టి ఇంత‌వ‌ర‌కు లేరు. ఇక‌మీద వ‌స్తార‌ని కూడా నేను అనుకోవ‌టం లేదు. నిజంగా భ‌గ‌వంతుడు ఆమెకు చాలా అన్యాయం చేశాడు. శ్రీదేవి హ‌ఠాన్మ‌రణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను.

- చిరంజీవి

శ్రీదేవి గారి హటాన్మరణం బాధాకరం !!

శ్రీదేవి గారి హటాన్మరణం బాధాకరం !!

శ్రీదేవిగారితో నాన్నగారు చాలా సినిమాల్లో నటించారు. ఎలాంటి భావాన్నైనా కళ్ళతోనే పలికించగల మహానటి శ్రీదేవిగారు. ఆవిడ హటాన్మరణం చిత్రసీమకు తీరని లోటు. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని వేడుకొంటున్నాను.
- నందమూరి బాలకృష్ణ

శ్రీదేవి ఇక లేరు అంటే నమ్మలేం...

శ్రీదేవి ఇక లేరు అంటే నమ్మలేం...

భారతీయ వెండి తెరపై తనదైన ముద్రను వేసిన శ్రీదేవి గారు హఠాన్మరణం నమ్మలేనిదని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. దుబాయిలో వివాహానికి వెళ్ళిన శ్రీదేవిగారుచనిపోయారని తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు.శ్రీదేవిగారి మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తమ సంతాపాన్ని తెలియ చేస్తూ"అసమానమైన అభినయ ప్రతిభతోభారతప్రేక్షక లోకం అభిమానాన్ని ఆమె చూరగొన్నారు.శ్రీదేవి గారు ఇక లేరు అనే మాట నమ్మలేనిది... కానీ ఆమె వెండి తెరపై పోషించిన భిన్నమైన పాత్రలన్నీచిరస్మరణీయాలే. భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్ర సీమలో సుస్థిరం. శ్రీదేవి గారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకొనే మానసిక స్థైర్యాన్ని భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నాను.

-పవన్ కల్యాణ్

శ్రీదేవిగారి కుటుంబంతో నా అనుబంధం

శ్రీదేవిగారి కుటుంబంతో నా అనుబంధం

శ్రీదేవిగారితో నా అనుబంధం ఈనాటిది కాదు. నా సూపర్ హిట్ సినిమాల్లో ఎక్కువగా హిందీలో రీమేక్ చేసింది బోణీ కపూర్ గారే. ముంబై వెళ్ళినప్పుడల్లా శ్రీదేవిగారి ఇంటికి వెళ్లకుండా ఎప్పుడూ వెనుదిరగలేదు. అటువంటి మంచి మనిషి, అద్భుతమైన నటి నేడు మన మధ్య లేదు అన్న చేదు నిజాన్ని దిగమింగడం చాలా కష్టంగా ఉంది.

- ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం

శ్రీదేవి మరణం భారతీయ చిత్రసీమకు తీరని లోటు !!

శ్రీదేవి మరణం భారతీయ చిత్రసీమకు తీరని లోటు !!

శ్రీదేవి కుటుంబంతో నాకు తిరుపతి నుండి మంచి అనుబంధం ఉంది. ఆమె తల్లి తిరుపతికి చెందినవారు. శ్రీదేవితో కలిసి చాలా సినిమాల్లో నటించాను. భారతీయ చిత్రసీమ మంచి నటిని మాత్రమే కాదు, ఉన్నతమైన వ్యక్తిని కూడా కోల్పోయింది. నా 42వ సినీ జీవిత ఉత్సవాలు విశాఖపట్నంలో జరుగుతున్నప్పుడు కేవలం ఫోన్ చేయగానే వైజాగ్ వచ్చి, ఆ వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోనిబ్బరాన్ని ఆ శిరిడీ సాయినాధుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాను.

- డా.మోహన్ బాబు

‘శ్రీదేవి' హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతి

‘శ్రీదేవి' హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతి


‘శ్రీదేవి' హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతి కి గురి చేసింది. నమ్మలేకపోతున్నాను.దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా మా కుటుంబానికి ఎంతో సన్నిహితురాలు. ఆమె మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. బాలీవుడ్ లో యాష్ చోప్రా రూపొందించిన ‘చాందిని, లమ్హే' చిత్రాలు శ్రీదేవి నటజీవితానికి ఎంతో వన్నె తెచ్చాయి. ఆమె కీర్తిని దశ,దిశలా వ్యాపింప చేశాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సాను భూతిని తెలియ జేస్తున్నాను.

- డా.టి.సుబ్బరామి రెడ్డి , ఎం.పి

1980 దశకంలో

1980 దశకంలో

1980 దశకంలో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. వాటిలో కొన్ని, నగీనా, మిస్టర్ ఇండియా, చాందిని, చాల్‌బాజ్, ఖుధాగవా, లమ్హే, లాడ్లా, జుదాయి లాంటి చిత్రాలు చరిత్రలో నిలిచిపోయాయి. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని కథానాయికగా మారిన ఆమె హీరోలకు ధీటుగా అధిక పారితోషికం అందుకునేవారు.

English summary
Sridevi Boney Kapoor, the celebrated Bollywood actor whose contributions to Indian cinema won her a Padma Shri award, died of a massive cardiac arrest in Dubai on Saturday. She was 54. Along with her husband Boney and younger daughter Khushi, Sridevi had travelled to the emirate to attend actor Mohit Marwah's wedding.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu