»   » శ్రీదేవి చేతి మహిమ, దుబాయ్‌లో వేలం పెట్టేస్తున్నారుగా.. అమ్ముడు కాబోతున్న సోనమ్!

శ్రీదేవి చేతి మహిమ, దుబాయ్‌లో వేలం పెట్టేస్తున్నారుగా.. అమ్ముడు కాబోతున్న సోనమ్!

Subscribe to Filmibeat Telugu
Sonam Kapoor Set To Auction

శ్రీదేవితో మంచి నటి మాత్రమే కాదు.. కళా ప్రియురాలు కూడా దాగి ఉంది. ఖాళీ సమయాల్లో శ్రీదేవి తనలోని చిత్ర కారిణిని బయటకు తీసేది. అలా శ్రీదేవి చేతి నుంచి జాలువారిన పెయింటింగ్ లలో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ మరియు మైఖేల్ జాక్సన్ చిత్రాలు ఉన్నాయి. శ్రీదేవి మరణం తరువాత ఆ చిత్ర పటాల్ని దుబాయ్ లో వేలం పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర పటాల్ని ఇప్పటికే లక్షలు వెచ్చించి సొంతం చేసుకునేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారు.

 గొప్ప నటి

గొప్ప నటి

శ్రీదేవి గొప్ప నటిగానే మనందరికీ తెలుసు. కానీ ఆమెలో అనేక నైపుణ్యాలు దాగి ఉన్నాయి. నటనకు ఎక్కువ కాలం పరిమితం కావడంతో శ్రీదేవిలోని మిగిలిన కళలు బయటకు రాలేదు.

 డాన్సులతో ఆకట్టుకునే నైపుణ్యం

డాన్సులతో ఆకట్టుకునే నైపుణ్యం

శ్రీదేవిలో మంచి డాన్సర్ కూడా దాగి ఉంది. ఆమె ముగ్దమనోహర రూపానికి యువత ఫిదా అయ్యేవారు. స్టార్ హీరోల సరసన డాన్స్ చేస్తుంటే సినీ అభిమానులకు రెండు కళ్ళు సరిపోయేవి కావు. శ్రీదేవి అందం, నటన మరియు నృత్యం అన్ని అంశాలలోను అలరించేవారు.

 మెగాస్టార్ కు ధీటుగా

మెగాస్టార్ కు ధీటుగా

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో శ్రీదేవి దేవకన్య పాత్రలో అబ్బురపరిచింది. ఆ చిత్రంలో శ్రీదేవి దేవకన్యగా చూసిన వారు నిజంగానే దివి నుంచి దిగివచ్చిందా అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేంతగా ఇంద్రజ పాత్రలో మెప్పించింది. అంతే కాదు ఆ చిత్రంలో మెగాస్టార్ కు ధీటుగా శ్రీదేవి స్టెప్పులు వేసి మైమరపించింది.

 అతిలోక సుందరిలో మరో కళ కూడా

అతిలోక సుందరిలో మరో కళ కూడా

శ్రీదేవితో మరో అద్భుతమైన కళ కూడా దాగి ఉంది. శ్రీదేవి మంచి చిత్రకారిణి. తీరికసమయాల్లో శ్రీదేవి చేతినుంచి జాలువారిని పెయింటింగ్ లు చాలా ఉన్నాయి.

 అతిలోక సుందరి అందాల భామ బొమ్మ గీస్తే

అతిలోక సుందరి అందాల భామ బొమ్మ గీస్తే

సావరియా చిత్రం సందర్భంగా సోనమ్ కపూర్ ఇచ్చిన ఓ ఫోజు శ్రీదేవిని బాగా ఆకట్టుకుంది. అంతే తడువుగా తనకు నచ్చిన ఆ ఫోజుని శ్రీదేవి అదమైన పెయింటింగ్ గా మలిచింది.

 మైఖేల్ జాక్సన్ కూడా

మైఖేల్ జాక్సన్ కూడా

పాప్ స్టార్ గా ఉర్రూతలూగించిన మైఖేల్ జాక్సన్ బొమ్మని కూడా శ్రీదేవి గీశారు.

 అంగీకరించని శ్రీదేవి

అంగీకరించని శ్రీదేవి

ఈ రెండు చిత్రాలని దుబాయ్ లో వేలం వేయడానికి 2010 లో అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ అనే సంస్థ శ్రీదేవిని సంప్రదించింది. కానీ అందుకు శ్రీదేవి ఒప్పుకోలేదు. కాగా వేలంలో వచ్చిన మొత్తాన్ని చారిటికి వాడతామని చెప్పడంతో శ్రీదేవి అంగీకరించారు.

 వేలానికి ఆ రెండు చిత్రాలు

వేలానికి ఆ రెండు చిత్రాలు

శ్రీదేవి చేతి నుంచి జాలువారిన సోనమ్ కపూర్, మైఖేల్ జాక్సన్ చిత్రాలని త్వరలోనే వేలంలో అమ్ముడుపోనున్నాయి.

 శ్రీదేవి ఇష్టం అదే, అందుకే

శ్రీదేవి ఇష్టం అదే, అందుకే

తాను గీసిన చిత్రాలలో మైఖేల్ జాక్సన్ పెయింటింగ్ ఇటామని శ్రీదేవి ఓ సందర్భంలో అన్నారు. అందుకే ఆ ఒక్క చిత్ర కనీసధర 8 లక్షలుగా వేలం ప్రక్రియ మొదలు కానుంది.

English summary
Sridevi made Sonam Kapoor painting. Sridevi paintings alla set to auctioned in Dubai
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu