»   »  ఎన్టీఆర్ తో శ్రీదేవి..అప్పట్లోనే రికార్డ్ !

ఎన్టీఆర్ తో శ్రీదేవి..అప్పట్లోనే రికార్డ్ !

Subscribe to Filmibeat Telugu

తెలుగు చిత్ర పరిశ్రమపై శ్రీదేవి చెరగని ముందర వేసింది. తరాల తరబడి స్టార్ హీరోలతో శ్రీదేవి నటించింది. ఎన్టీఆర్ కు మానవరాలిగా నటించిన శ్రీదేవి ఆ తరువాత ఆయనికే హీరోయిన్ గా మారింది.ఏఎన్నార్ సరసన ప్రేయసిగా నటించి మెప్పించింది. ఆ తరువాత తరం చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తో కూడా హీరోయిన్ గా శ్రీదేవి నటించడం విశేషం.

ఎన్టీఆర్ తో 12 చిత్రాలు

ఎన్టీఆర్ తో 12 చిత్రాలు

ఎన్టీఆర్ తో కలసి శ్రీదేవి 12 చిత్రాల్లో నటించడం విశేషం. ఎన్టీఆర్ కు మానవరాలిగా నటించిన బాలనటిగా మన్ననలు అందుకున్న శ్రీదేవి, ఆ తరువాత ఆయనతోనే హీరోయిన్ గా నటించి ఘనవిజయాలు అందుకుంది.

వేటగాడు చిత్రంతో బ్లాక్ బాస్టర్

వేటగాడు చిత్రంతో బ్లాక్ బాస్టర్

వేటగాడు చిత్రంలో శ్రీదేవి ఎన్టీఆర్ తో నటించింది. ఆ చిత్రంలో పాటలు, స్టెప్పులతో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి మెస్మరైజ్ చేసింది. వేటగాడు చిత్రం అప్పట్లోనే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్లు

వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్లు

వెండి తెరపై శ్రీదేవి, ఎన్టీఆర్ జంట అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. వరుసగా నాలుగు ఏళ్ల పాటు శ్రీదేవి, ఎన్టీఆర్ నటించిన చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. వాటిలో సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి వంటి చిత్రాలు 300 రోజులు ప్రదర్శించడం విశేషం.

అతిలోక సుందరిగా చరిత్ర, వెంకీ, నాగ్ తో కూడా

అతిలోక సుందరిగా చరిత్ర, వెంకీ, నాగ్ తో కూడా


ఎన్టీఆర్, ఏఎన్నార్ తోనే కాదు.. ఆ తరువాతి తరం స్టార్ హీరోలు చిరంజీవి, వెంకీ, నాగార్జున సరసన కూడా శ్రీదేవి నటించి మెప్పించింది. మెగాస్టార్ సరసన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో శ్రీదేవి పాత్ర చారిత్రాత్మకం అని చెప్పొచ్చు. ఆ చిత్రం తరువాత అతిలోక సుందరి అనే పదనైకి శ్రీదేవి పర్యాయ పదంగా మారిపోయింది.

English summary
Sridevi memorable movies with NTR. Some movies of these pair set records at that time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu