»   » కూతురు గురించి మాట్లాడుతూ ఏడ్చేసిన శ్రీదేవి!

కూతురు గురించి మాట్లాడుతూ ఏడ్చేసిన శ్రీదేవి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కూతురు గురించి మాట్లాడుతూ శ్రీదేవి ఏడ్చేసిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలా అని ఇదేదో సినిమా ఏడుపు కాదు... రియల్‌గా ఏడ్చేసింది. అదే సమయంలో ఆమె శ్రీదేవి రియల్ కూతురు కాదు.... సినిమా కూతురు! కన్ ఫ్యూజ్ అయ్యారా? అయితే అసలు విషయంలోకి వెల్దాం.

శ్రీదేవి నటించిన 'మామ్' మూవీ జులై 7న విడుదలైన సంగతి తెలిసిందే. తల్లి, కూతురు సెంటిమెంటుతో తెరకెక్కిన ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో శ్రీదేవి తల్లి పాత్ర పోషించగా, ఆమె కూతురుగా పాకిస్థాన్ నటి సాజల్ నటించింది.

ఏడ్చేసిన శ్రీదేవి

‘మామ్' సినిమా ప్రమోషన్లలో సాజల్ లేక పోవడంపై శ్రీదేవి కాస్త ఎమోషన్ అయింది. షూటింగ్ సమయంలో సాజల్ తో అనుబంధం పెరిగిందని, తన ఇద్దరు కూతుళ్లతో పాటు, సాజిల్ కూడా తనకు మరో కూతురు అనేంతగా తనకు దగ్గరైందన్నారు.

వారిద్దరూ లేకుండా

వారిద్దరూ లేకుండా

తాను ఎందుకింత ఎమోషనల్ అవుతున్నానో అర్థం కావటం లేదని.. సాజల్, అద్నాన్ లేకుండా ఇంత మంచి సినిమా సాధ్యమయ్యేది కాదని శ్రీదేవి చెప్పుకొచ్చారు. సినిమా విజయాన్ని తనతో పంచుకోవడానికి వారు ఇక్కడ లేక పోవడం లోటే అని ఆమె అన్నారు.

గొప్ప సినిమాగా

గొప్ప సినిమాగా

ఈ మధ్య కాలంలో తల్లి, కూతురు అనుబంధాన్ని అద్భుతంగా చూపిస్తూ వచ్చిన సినిమాలు అరుదైపోయాయి. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ‘మామ్' రూపంలో ఇండియన్ స్క్రీన్ మీద ఓ గొప్ప సినిమా వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

300వ చిత్రం

300వ చిత్రం

బాల నటిగా కెరీర్ మొదలు పెట్టిన శ్రీదేవి ఈ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ‘మామ్' మూవీ శ్రీదేవి నటించిన 300వ చిత్రం. ‘మామ్' తన కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని ఒక మంచి చిత్రమని శ్రీదేవి చెప్పుకొచ్చారు.

English summary
As MOM is performing well at the box office, Sridevi got emotional during a video shoot and sent a message to her on-screen daughter and Pakistani actor Sajal Ali. In the video shared by a fan, the actor broke down into tears.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu