త్రీడీలోకి శ్రీదేవి సూపర్ హిట్ చిత్రం
ఈ ఆలోచనకు పదిహేనేళ్ల క్రిందటి వచ్చిన 'టైటానిక్'ప్రేరణ ఇచ్చింది. 'టైటానిక్' చిత్రాన్ని త్రీడీలో మరోమారు చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు జేమ్స్ కామెరాన్. ఆయన దర్శకత్వం వహించిన 'టైటానిక్' ఇటీవల త్రీడీలో తెరపైకి వచ్చింది. దీనికి వచ్చిన స్పందన మన దర్శకనిర్మాతల్ని ఆలోచింపజేస్తోంది. 'మిస్టర్ ఇండియా' చిత్రాన్ని ఇప్పుడు త్రీడీలోకి మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు త్రీడీలోకి మార్చే వ్యవహారాలపై చర్చలు సాగిస్తున్నట్లు బోనీ స్పష్టం చేశారు. బహుశా వచ్చే ఏడాది మే నుంచి త్రీడీ పనులు మొదలుపెట్టి 2014లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఆ తరవాతే రెండో భాగాన్ని రూపొందిస్తామని బోనీ తెలిపారు.
ఇక ఈ త్రీడి చిత్రం అన్ని వర్గాల వాళ్ళని అలరించనున్నట్లు నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ త్రీడి కోసం నిపుణలు పని ప్రారంభించినట్లు చెప్తున్నారు. శ్రీదేవి సైతం తను త్రిడిలో కనపించటంపై ఆనందం వ్యక్తం చేస్తోంది. సీక్వెల్ కన్నా ఇదే సరైన వ్యవహారమని ఆమె భావిస్తోంది. ఈ త్రీడి చిత్రాన్ని తమిళ,తెలుగు భాషల్లో సైతం డబ్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం హిట్ అయితే మరిన్ని క్లాసిక్స్ త్రిడిలో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












