»   » శ్రీదేవి న్యూ మూవీ ‘మామ్’ టీజర్ ఇదే...

శ్రీదేవి న్యూ మూవీ ‘మామ్’ టీజర్ ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటి శ్రీదేవి త్వరలో 'మామ్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజైంది. రవి ఉడయార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో జులై 14న విడుదల కాబోతోంది.

ఒకప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమను తన అందంతో షేక్ చేసిన శ్రీదేవి... నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన ఇద్దరు కూతుళ్ల పెంపకంపైనే దృష్టి పెట్టిన శ్రీదేవి... 2012లో గౌరీ షిండే దర్శకత్వంలో 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఐదేళ్ల గ్యాప్ తర్వాత మామ్

ఐదేళ్ల గ్యాప్ తర్వాత మామ్

సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తున్న శ్రీదేవి ‘ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్ తీసుకున్నారు. ఇపుడు శ్రీదేవి ప్రధాన పాత్రలో ‘మామ్' అనే సినిమా వస్తోంది. ఈ ఐదేళ్ల గ్యాపులో తమిళంలో విజయ్ పులి మూవీలో ఓ ముఖ్యమైన పాత్ర చేసారు.

సైలెంటుగా షూటింగ్

సైలెంటుగా షూటింగ్

‘మామ్' సినిమాకు నిర్మాత మరెవరో కాదు... శ్రీదేవి భర్త బోనీ కపూర్. ఈ సినిమా గురించి బయటకు తెలియకుండా షూటింగ్ పూర్తి చేసి అంతా పూర్తయ్యాక అసలు విషయం బయట పెట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

‘మామ్'లో పాకిస్థాన్ యాక్టర్లు

‘మామ్'లో పాకిస్థాన్ యాక్టర్లు

ఈ చిత్రంలో ఇద్దరు పాకిస్థానీ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకరు శ్రీదేవి భర్త పాత్ర చేస్తున్న అద్నాన్ సిద్దిఖి, మరొకరు ఆమె కూతురిగా నటిస్తున్న సజల్‌ అలీ.

కథేంటి?

కథేంటి?

ఈ సినిమా కథ ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉంటుందని.... సినిమాలో శ్రీదేవి సవితి తల్లిగా నటిస్తోందని, ఆమెకు, కూతురికి మధ్య జరిగే సంఘర్షణ నేపథంలో కథ సాగుతుందని తెలుస్తోంది. కథ చాలా ప్రత్యేకంగా ఉంది కాబట్టే శ్రీదేవి ఈ సినిమా చేసినట్లు చెబుతున్నారు.

English summary
Sridevi next movie "MOM" teaser released. Mom is thriller directed by Ravi Udyawar and produced by Zee Studios, Boney Kapoor and Sunil Manchanda. The film stars Sridevi, Nawazuddin Siddiqui and Akshaye Khanna. Music by the maestro A. R. Rahman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu