»   » రాజమౌళితో పాటు అమితాబ్, షారుక్‌ లాంటి వారికి శ్రీదేవి షాకిచ్చింది... కారణం ఇవే!

రాజమౌళితో పాటు అమితాబ్, షారుక్‌ లాంటి వారికి శ్రీదేవి షాకిచ్చింది... కారణం ఇవే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన శ్రీదేవి తన అద్భుతమైన టాలెంట్, అందం కారణంగా ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రికార్డు స్థాయిలో ఆమె దాదాపు 300 చిత్రాల్లో నటించారు. ఆమెతో సినిమాలు చేయడానికి దర్శకులు, హీరోలు, నిర్మాతలు పోటీపడేవారు.

సినిమాల్లో తన పాత్రలను ఎంపిక చేసుకునే క్రమంలో శ్రీదేవి చాలా కేర్‌ఫుల్‌గా ఉండేవారు. నచ్చక పోతే రిజక్ట్ చేసేవారు. అయితే కొన్ని సినిమాల విషయంలో ఆమె అంచనాలు తప్పాయి. ఆమె తిరస్కరించిన కొన్ని సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. అందుకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.

బాహుబలి

బాహుబలి

ఇండియాలోనే అతిపెద్ద హిట్ మూవీ ప్రాజెక్ట్ ‘బాహుబలి'లో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు తొలుత శ్రీదేవిని సంప్రదించారు. అయితే ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. రెమ్యూనరేషన్ విషయంలో ఆమె కాంప్రమైజ్ కాక పోవడం, నిర్మాతలు కూడా అంత ఇచ్చుకోవడానికి అప్పుడు దైర్యం చేయక పోవడంతో.... ఈ ప్రాజెక్టు శ్రీదేవి చేజారింది.

 మొహబ్బతేన్

మొహబ్బతేన్

బాలీవుడ్ హిట్ మూవీ మొహబ్బతేన్ చిత్రంలో శ్రీదేవికి ఆపర్ వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ పాత్రను ఆమె తిరస్కరించారట. ఇందులో ఆమెకు అమితాబ్ లవ్ ఇంట్రస్ట్ పాత్రను కేటాయించారని, ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేక పోవడంతో తిరస్కరించినట్లు చెబుతుంటారు. కేవలం శ్రీదేవి ఈ సినిమాలో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆ పాత్ర రాశారు. అమె నో చెప్పడంతో స్క్రిప్టు నుండి ఆ పాత్రను కూడా తీసేశారు. అందుకే సినిమాలో మనకు అమితాబ్ లవ్ ఇంట్రస్టు పాత్ర కనిపించదు.

 దార్

దార్

షారుక్ ఖాన్ ‘దార్' మూవీలో కూడా హీరోయిన్‌గా శ్రీదేవికే తొలి అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో జుహీ చావ్లా చేసిన పాత్రను యశ్ చోప్రా మొదట శ్రీదేవితో చేయించాలనుకున్నారు. అయితే ఈ క్యారెక్టర్ నచ్చక పోవడంతో శ్రీదేవి నో చెప్పింది.

బగ్భన్

బగ్భన్

‘బగ్భన్' చిత్రంలో కూడా హేమా మాలిని కంటే ముందు శ్రీదేవికే అవకాశం వచ్చింది. ఇందులో ఆమె అమితాబ్‌కు జోడీగా నటించాల్సి ఉంది. 2003లో ఈ చిత్రం వచ్చింది. అదే సమయంలో శ్రీదేవి తన రీ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ చిత్రం తన రీఎంట్రీ స్థాయికి తగిన విధంగా లేక పోవడంతో తిరస్కరించారు.

బేటా

బేటా

బేటా మూవీలో మాధురీ దీక్షిత్ చేసిన ‘ధక్ ధక్' సాంగుకు మంచి పేరు వచ్చింది. వాస్తవానికి సినిమా, ఆ పాటను ప్రత్యేకించి శ్రీదేవి కోసం రాశారు. అయితే అప్పటికే అనిల్ కపూర్‌తో చాలా సినిమాలు చేయడంతో ఆమె తిరస్కరించారని చెబుతుంటారు.

 అజూబా

అజూబా

ఫిల్మ్ మేకర్ శశి కపూర్ ‘అజూబా' చిత్రంలో అమితాబ్ జోడీగా శ్రీదేవిని పెట్టుకోవాలనుకున్నారు. అయితే ఈ సినిమాలో తన పాత్రకు అంతగా ప్రాధాన్యం లేక పోవడంతో శ్రీదేవి తిరస్కరించారు. దీంతో ఆ అవకాశం డింపుల్ కపాడియాకు దక్కింది.

 ఆ సినిమాలు కూడా

ఆ సినిమాలు కూడా

దీంతో పాటు బాలీవుడ్ చిత్రాలు దిల్ తో పాగల్ హై, యాదేంన్, మోహ్రా, బాజిగర్, ఆయినా అండ్ లేకిన్ చిత్రాలు కూడా ఆమె తిరస్కరించినట్లు చెబుతుంటారు.

English summary
Bollywood super star actress Sridevi starred in over 300 films, but there are a few that she rejected as well. Most of her rejected flicks also turned out to be iconic movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu